నా నువ్వే ట్విట్టర్ రివ్యూ

రొటీన్ రోత సినిమాల నుండి బయటపడేందుకు కళ్యాణ్ రామ్ కొత్తగా ట్రై చేస్తున్నారు. తనలో దాగిన లవ్ అండ్ రొమాంటిక్ యాంగిల్‌ని తమన్నా కోసం ఇన్నాళ్లకు బయటకు తీశారు అదే ‘నా నువ్వే’ మూవీ ద్వారా. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్‌, మిల్కీ బ్యూటీ త‌మ‌న్నా జంట‌గా నటించిన రొమాంటిక్ ప్రేమ కథా చిత్రం ‘నా నువ్వే’ మంచి అంచనాలతో గురువారం నాడు (జూన్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో.. జ‌యేంద్ర దర్శ‌క‌త్వంలో కిర‌ణ్ ముప్ప‌వ‌ర‌పు, విజ‌య్ వ‌ట్టికూటి ఈ సినిమాను నిర్మించారు.

ఇప్ప‌టి వ‌ర‌కు మాస్ అండ్ క‌మ‌ర్షియ‌ల్ సినిమాలు చేసిన నంద‌మూరి క‌ల్యాణ్ రామ్ స‌రికొత్త లుక్‌లో క‌న‌ప‌డుతూ రొమాంటిక్ ఎంట‌ర్‌టైన‌ర్ చేయ‌డంతో సినిమాపై అంచ‌నాలు పెరిగాయి. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా థియేట్రిక‌ల్ ట్రైల‌ర్, ప్రమోషన్‌ సాంగ్స్ సినిమా అంచ‌నాల‌ను రెట్టింపు చేసింది. నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా మ‌ధ్య కెమిస్ట్రీ.. స్టార్ సినిమాటోగ్రాఫ‌ర్ పి.సి.శ్రీరామ్ అందించిన అమేజింగ్ విజువ‌ల్స్‌.. శ‌ర‌త్ అందించిన మెలోడియ‌స్ ఆల్బమ్ సినిమాకు మేజ‌ర్ ఎసెట్‌గా నిలుస్తున్నాయి.

ఆల్‌రెడీ విడుద‌లైన సాంగ్స్‌కు ప్రేక్ష‌కుల నుండి హ్యూజ్ రెస్పాన్స్ వ‌స్తుంది. క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జోడి ఎలా ఉంటుందోన‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ట్రైల‌ర్ విడుద‌లైన త‌ర్వాత ఈ జోడి హిట్ పెయిర్‌గా పేరు తెచ్చుకుంటార‌నే భావన ప్రేక్షకుల నుండి వ్యక్తమవుతోంది. ఈ ధీమా తోటే.. ‘నా నువ్వే’ పక్కా హిట్ అంటున్నారు చిత్ర యూనిట్. అయితే నేడు ప్రేక్షకుల మందుకు వచ్చిన ఈ మూవీపై ట్విట్టర్‌లో పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

సినిమా చాలా కూల్‌గా ఉందని.. తమన్నా, కళ్యాణ్ రామ్ కెరియర్‌లో బెస్ట్ పెర్ఫామెన్స్ ఇచ్చారంటున్నారు. దర్శకుడు చాలా హానెస్ట్‌‌గా చెప్పాల్సిన విషయాన్ని సూటిగా సుత్తిలేకుండా చెప్పాడని స్క్రీన్ ప్లే చాలా బావుందంటున్నారు.

ఇదో అందమైన ప్రేమ కథా చిత్రం. తమన్నా డాన్స్‌తో ఇరగదీసింది. చాలా అందంగా కనిపించింది. పీసీ శ్రీరామ్ అద్భుతమైన కెమెరా పనితనంతో మరోసారి మాయ చేశారు. జయేంద్ర డైరెక్షన్, తమన్నా.. కళ్యాణ్ రామ్‌ల పెర్ఫామెన్స్ బావుంది.రొమాంటిక్ సీన్లలో ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగా వర్కౌట్ అయ్యింది. సాంగ్స్ పిక్చరైజేషన్ బావుంది. కథ మొత్తం కూల్‌గా సాగి క్లైమాక్స్ చిన్న ట్విస్ట్‌తో అందమైన ముగింపు ఇచ్చారు. ఓవరాల్‌గా ‘నా నువ్వే’ మంచి రొమాంటిక్ విజువల్ ట్రీట్ అంటూ ట్విట్టర్‌లో తమ అభిప్రాయాన్ని పంచుకుంటున్నారు ప్రేక్షకులు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *