యాంకర్ సుమ గురించి ఎవరికీ తెలియని సీక్రెట్స్ ఇవే!!

యాంకర్ సుమ.. తెలుగులో లెజండరీ యాంకర్. ఆమె తన షోల నిర్వహణ సమయంలో సమయోచితంగా వేసే పంచ్‌లు, పూయించే నవ్వులు కుటుంబ సమేతంగా కూర్చుని హాయిగా ఆనందించేలా ఉంటాయి. ఒక లేడీ యాంకర్ ఇంత కాలంపాటు అప్రతిహతంగా కొనసాగడం ఒక గొప్ప విషయం. సుమ గురించి ఆసక్తి కలిగించే కొన్ని విషయాలను తెలుసుకుందాం. సుమ 1975 మార్చి 22న జన్మించారు. 2018 మార్చి 22 నాటికి 43 సంవత్సరాలు వచ్చాయి. ఆమెది అసలు కేరళ. ఆమె తండ్రి పేరు పిఎన్ కుట్టి, తల్లి పేరు పి. విమల. సుమ చిన్నప్పుడే డ్యాన్స్ నేర్చుకున్నారు.

సుమ చిన్న వయసులో ఉన్నప్పుడే ఆమె తల్లిదండ్రులు కేరళ నుంచి సికింద్రాబాద్ వచ్చారు. చిన్ననాడే వాళ్ల అమ్మ తెలుగు నేర్పించేవారు. స్కూల్‌లో ఉన్నప్పుడు సెకండ్ లాంగ్వేజ్ కింద తెలుగు తీసుకోవడం ఇప్పుడు అడ్వాంటేజ్ అయింది. సికింద్రాబాద్ తార్నాకలోని సైంట్ ఆన్స్ కాలేజీలో ఇంటర్ చదువుకున్నారు ఆమె. మొదట బైపీసీ తీసుకుని తర్వాత ఆర్ట్స్ గ్రూప్ లోకి మారారు. అనంతరం రైల్వే డిగ్రీ కాలేజీలో బీకామ్‌లో చేశారు. తర్వాత కరెస్పాండెంట్‌లో ఎంకామ్ పూర్తి చేశారు. సికింద్రాబాద్‌లో ఆనంద్ శంకర్ అనే గురువు దగ్గర భరత నాట్యం, భద్ర అనే గురువు దగ్గర కూచిపూడిని వాళ్ల అమ్మ నేర్పించారు. అనంతరం పలు ప్రదర్శనలు ఇస్తూ ఉండేది.

ఓసారి రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వార్షికోత్సవంలో సుమ డ్యాన్స్ ప్రదర్శన ఇచ్చారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఉమామహేశ్వరరావు ఆమెను చూసి దూరదర్శన్ సీరియల్ పెళ్లిచూపులులో నటించాలని అడిగారు. అప్పుడు సుమ వయసు 16 సంవత్సరాలు. అలా ఆమె నటనా కెరీర్ మొదలయ్యింది. అనంతరం పలు దూరదర్శన్ సీరియళ్లలో నటించారు. ఆ సమయంలో రాజీవ్ కనకాల తండ్రి దేవదాస్ ‘మేఘమాల’ అనే సీరియల్‌లో తీశారు. ఇందులో సుమ, రాజీవ్ కూడా నటించారు. అప్పుడే వారిద్దరి మధ్య పరిచయమై ప్రేమగా మారింది. 1999 ఫిబ్రవరి 10న రాజీవ్ కనకాలతో సుమకు వివాహమైంది. పెళ్లి సమయానికి సుమ వయసు 24 సంత్సరాలు.

సుమ ఎత్తు 5.4 అడుగులు, బరువు 56 కేజీలు. 21 సంవత్సరాల వయసులో 1996లో సుమ యాంకరింగ్ మొదలుపెట్టారు. 1996లోనే కళ్యాణప్రాప్తిరస్తు అనే సినిమా ద్వారా మూవీల్లోకి ఎంటరయ్యారు. చివరి సినిమా బాద్షా. ఒక కొడుకు ఒక కూతురు ఉన్నారు. కొడుకు పేరు రోషన్, కూతరు పేరు మనశ్విని. కొడుకు రోషన్ పుట్టే సమయానికి రాజీవ్‌కు 27 సంవత్సరాలు. 2010లో టీవీ9లో పంచవతారం ప్రోగ్రామ్‌కు బెస్ట్ నంది అవార్డు వచ్చింది. అదే ఏడాదిలో స్టార్ మహిళకు బెస్ట్ యాంకర్ అవార్డు వచ్చింది. స్టార్ మహిళ 2000 ఎపిసోడ్‌లు పూర్తి చేసినందుకు లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో పేరు దక్కించుకుంది. జీటీవీలో లక్కుకిక్కు అనే ప్రొగ్రామ్‌ను, ఆరుగురు అత్తలు అనే సీరియల్‌ను ఆమె స్వయంగా ప్రొడ్యూస్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *