ఏసీ, కూలర్లూ అద్దెకు కావాలా..? అయితే ఇలా చేయండి..!

ఈసారి ఎండలు ఓ తీత తీసేట్టుగా ఉన్నాయి. గతంలో కంటే ఉష్ణోగ్రతలు ఎక్కువగానే ఉంటాయని వాతావరణ శాఖ ఇప్పటికే ప్రకటించింది. చెప్పినట్టుగానే మార్చి నెల నుంచే ఎండల కాక మొదలైంది. ప్రారంభం నుంచే ఈ సీజన్ లో వేసవి ఎండలు మండిపోతున్నాయి. ఉక్కపోత నుంచి బయటపడేందుకు ఏసీ లేదంటే కూలర్‌ కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. అలా కాకుండా ఈ వేడి బాధల నుంచి ఉపశమనం పొందలేమా అంటే మేం దీనికో పరిష్కారమార్గం చూపుతామంటుంది గ్రాబ్‌ ఆన్‌ రెంట్‌ డాట్‌ కామ్‌.

ఈ వేసవిలో ఏసీ, కూలర్లు, రిఫ్రిజరేటర్లును అద్దెకు అందిస్తామంటోంది ఈ సంస్థ. సుప్రసిద్ధ బ్రాండ్లకు చెందిన ఈ ఉత్పత్తులను తమ అవసరానికి తగిన సామర్థ్యంలో కూడా ఎంచుకోవచ్చని ఆ సంస్థ చెబుతోంది. కేవైసీ ఫార్మ్‌ నింపితే చాలు, నెలకు కేవలం రూ. 799 నుంచి రూ. 2,049లో అద్దె ప్రాతిపదికన కావాల్సిన ప్రొడక్ట్‌ను అందిస్తామని సంస్థ చెబుతోంది. సాధారణంగా ఆర్డర్‌ చేసిన 2-4 గంటల్లో ఉచితంగా డెలివరీ చేస్తామని, ఉచితంగా రీలొకేషన్‌ కూడా చేస్తామని సంస్థ అంటోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *