చిన్నవయసులో నటుడు మృతి!

అతి చిన్న వయసులోనే హాలీవుడ్‌ నటుడు, సంగీతకారుడు జాక్సన్ వోడెల్(20)మృతి చెందారు.   శాన్‌ ఫెర్నాండో వ్యాలీలో తర్జానా రెసిడెన్సీలో అనుమానాస్పదంగా వోడెల్‌ మృతి చెంది ఉండటాన్ని గుర్తించినట్టు వైరెటీకి లాస్‌ ఏంజెల్స్‌ కంట్రీ కార్నర్స్‌ ఆఫీసు ధృవీకరించింది. శవపరీక్ష కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉంచారు.

 

20 సంవ‌త్స‌రాల జాక్స‌న్ వోడెల్ అమెరికాలో అనుమాన‌స్ప‌దంగా మ‌ర‌ణించాడు ఆయ‌న చివ‌రి సినిమా ఫ‌రెవ‌ర్ మై గ‌ర్ల్. మ‌రిన్ని వివ‌రాలు తెలియాల్సి ఉంది. వోడెల్‌ నటుడిగా, సంగీతకారుడిగా రాణించడమే కాకుండా.. గేయ రచయితగా కూడా పేరులోకి వచ్చారు. ‘ఫరెవర్‌ మై గర్ల్‌’ అనే రోమాంటిక్‌ డ్రామాకు సౌండ్‌ట్రాక్‌ కూడా అందించారు.

 

ఈ ఏడాదే ఈ సినిమా విడుదలైంది. వోడెల్‌ ట్విటర్‌ అకౌంట్‌లో ఆయన కుటుంబ సభ్యులు ఉద్వేగభరితంగా ఓ పోస్టు చేశారు. ఎప్పటికీ వోడెల్‌ ఓ తారలా మెరుస్తూ, తెలివైన వాడిగా ఉంటారని అన్నారు. ఎప్పటికీ తాము ప్రేమించే, నైపుణ్యం గల ఆత్మవి నీవేనని పేర్కొన్నారు. “అతను చాలా పంచుకున్నారు. మా కుటుంబం ఎప్పుడూ నిజాన్నే ముందుకు తీసుకెళ్తుంది. వోడెల్‌ను ప్రేమించే మిగతా ప్రపంచం కూడా అలాగే ఉంటుంది” అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *