సరికొత్త ప్లాన్‌ తో జియో కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఎయిర్టెల్..!!

మార్కెట్‌లో పెరుగుతోన్న పోటీని ఎదుర్కునేందుకు టెలికాం కంపెనీలు ఇబ్బడిముబ్బడిగా ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. వినియోగదారులను తమవైపు తిప్పుకునేందుకు ముఖ్యంగా జియో, ఎయిర్‌టెల్‌ల మధ్య ఆఫర్ల ప్రత్యక్ష యుద్ధమే జరుగుతోందంటే అతిశయోక్తి కాదు. తాజాగా టెలికాం దిగ్గజం ఎయిర్‌టెల్ ప్రవేశపెట్టిన మరో కొత్త ఆఫర్‌‌ రిలయన్స్ జియోకు గట్టి పోటీని ఇవ్వనుంది. కేవలం రూ.65కే ప్రవేశ పెట్టిన ఈ ఆఫర్ వల్ల వినియోగదారుల నుంచి మంచి స్పందన రానుందని కంపెనీ భావిస్తోంది.

ప్రీపెయిడ్ కస్టమర్లకు అందిస్తోన్న ఈ ఆఫర్‌తో ఒకసారి రూ.65తో రీచార్జీ చేసుకుంటే 28 రోజుల వాలిడిటీతో 2జీ/3జీ డేటాను ఆఫర్ చేస్తోంది. అది కూడా టెలికాం సర్కిల్‌ను బట్టి 2జీ లేదా 3జీ అందిస్తుంది. కాగా ఈ ఆఫర్ ఎంపిక చేసిన ఎయిర్‌టెల్ కస్టమర్లకు మాత్రమేనని కంపెనీ పేర్కొంది. మై ఎయిర్‌టెల్‌ యాప్‌ ద్వారా ఈ ప్లాన్‌కు తాము అర్హులో కాదో యూజర్లు చెక్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఎయిర్‌టెల్‌ 49 రూపాయిలతో డైలీ ప్లాన్‌ను కూడా ఆవిష్కరించింది. దీని కింద ఒక్క రోజు పాటు 1జీబీ 4జీ డేటాను యూజర్లు పొందవచ్చు. 49 రూపాయలతో టారిఫ్‌ ప్లాన్‌ కూడా ఉంది. ఈ టారిఫ్‌ ప్లాన్‌ కింద 28 రోజుల వాలిడిటీతో 2జీబీ 3జీ/4జీ డేటాను ఆఫర్‌ చేస్తోంది.

రిలయన్స్‌ జియోకు కౌంటర్‌గా ఎయిర్‌టెల్‌ ఇటీవల పలు ప్లాన్లను లాంచ్‌ చేస్తూ ఉంది. ఇటీవలే వాయిస్‌ఓవర్‌ ఎల్టీఈ బీటా ప్రొగ్రామ్‌ను కూడా ఎయిర్‌టెల్‌ ఎంపికచేసిన జోన్లలో లాంచ్‌ చేసింది. ఈ ప్రొగ్రామ్‌ కింద ఎంపిక చేసిన యూజర్లకు 30జీబీ వరకు ఉచిత డేటాను అందిస్తోంది. హెచ్‌డీ వాయిస్‌ కాలింగ్‌, ఇన్‌స్టాంట్‌ కాల్‌ కనెక్ట్‌, మల్టి టాస్కింగ్‌ వంటి స్పెషల్‌ ఫీచర్లను వాయిస్‌ఓవర్‌ టెక్నాలజీ ఆఫర్‌ చేస్తోంది. ఈ సర్వీసులు ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ బెంగాల్‌, ఒరిస్సా, అస్సాం, కేరళ, బిహార్‌, పంజాబ్‌లలో అందుబాటులో ఉన్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *