అఖిల్ ఇలా చేసాడంటే నమ్మలేరు… షాక్ లో నాగ్,అమల

అక్కినేని అఖిల్ సెలబ్రెటీ వారసుడిగా టాలీవుడ్ లో అడుగు పెట్టిన యువ హీరో. అక్కినేని నాగార్జున చిన్న కొడుకుగా సినీ రంగ ప్రవేశం చేసి తనకంటూ సొంత ఇమేజ్ కోసం పరుగు పెడుతున్నాడు. ఇప్పటివరకు చేసిన సినిమాలు రెండే అయినా ఫ్యాన్ ఫాలోయింగ్ చూస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. అక్కినేని అభిమానులు వారసత్వంగా వచ్చిన అఖిల్ మొదటి సినిమా చేయక ముందే ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఇది నాణేనికి ఒక వైపు మాత్రమే. అఖిల్ మొదటి సినిమా పెద్ద డిజాస్టర్. రెండో సినిమా హలో విషయానికి వచ్చేసరికి అఖిల్ పరిస్థితిలో కొంచెం మార్పు వచ్చింది. సినిమాలో ఉన్న కంటెంట్ కొంత హెల్ప్ అయితే నాగ్ మార్కెట్ స్ట్రాటజీ మరి కొంత హెల్ప్ అయింది.

ఇప్పుడు ‘హలో’ సినిమా నాగార్జునతో పాటు యావత్తు చిత్ర యూనిట్ ని విస్మయానికి గురి చేసింది. విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకి అంతర్జాతీయ స్థాయిలో అవార్డు లభించింది. వరల్డ్ స్టంట్ అవార్డు కి హలో సినిమా బెస్ట్ ఫారెన్ సినిమాగా నామినేట్ అయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా అదిరిపోయే స్టంట్ లు ఉన్న సినిమాలను ఈ అవార్డు లకు ఎంపిక చేస్తారు.ఈ సారి హలో సినిమా ఆ ఛాన్స్ దక్కించుకోవటం పట్ల నాగ్ షాక్ లో మునిగిపోయాడట. తన కొడుకు అంత భారీ స్టంట్ లు చేయటం ఒక ఎత్తైతే,వాటికీ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావటం నాగ్ ఆనందాన్ని రెట్టింపు చేసింది.

కేవలం రెండో సినిమాకే అఖిల్ ఆంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవటంతో నాగార్జునలో పుత్రోత్సాహం పొంగి పొర్లుతుంది. అమల అయితే తెగ మురిసిపోతుందట. అమల ఇంకా చిన్నపిల్లవాడిగా చూసే అఖిల్ ఇంత సాహసం చేసాదంటే ఆశ్చర్యం కలుగుతుందట.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *