అర‌వింద్ డిన్న‌ర్ పార్టీ వెనుక అస‌లు క‌థేంటంటే?

సినిమా ఇండ‌స్ర్టీలో రిలేష‌న్ అన్న‌ది చాలా ఇంపార్టెంట్. అందుకే బాండిగ్ పెంచుకోవ‌డానికి తెలివైన యువ ద‌ర్శ‌కుల‌కు…హిట్ ఇచ్చిన డైరెక్ట‌ర్ల‌కు మ‌న హీరోలు కాస్ట్ లీ కార్లు బ‌హుమానంగా అందించి ద‌గ్గ‌ర పెట్టుకుంటారు. ఈ మ‌ధ్య‌నే హీరోలు, నిర్మాత‌లు ఈ ప‌ద్ద‌తిని అల‌వాటు చేసుకున్నారు. ట్యాలెంట్ ఉంటే ఇండ‌స్ర్టీ నెత్తిన పెట్టుకుంటుంద‌న‌డానికి ఇదొక మంచి ఊద‌హార‌ణ‌. అవ‌కాశం రానంత వ‌ర‌కే ఆఫీసులు చుట్టూ తిర‌గాలి. ఒక్క‌సారి వ‌చ్చి హిట్ ఇస్తే ఆఫీస్ లే మ‌న చుట్టూ తిరుతుంటాయి. ఇది ఇండ‌స్ర్టీ లెక్క‌. నిర్మాత అశ్విన్ దత్ అల్లుడు నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేసిన `మ‌హాన‌టి` ఇటీవ‌ల విడుద‌లై భారీ విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ప్రేక్ష‌కుల‌కు సినిమాకు బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. సినిమా ను ఇండ‌స్ర్టీ అంతా పొగ‌డ్త‌ల‌తో ముంచెత్తింది. సాక్ష్యాత్తు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి పిలిపించి మ‌రీ స‌న్మానం చేసారంటే? టాలీవుడ్ లో `మ‌హాన‌టి` స్థానం ఏంటో చెప్పొచ్చు.

ఇప్పుడు నిర్మాత అల్లు అర‌వింద్ వంత్తైంది. నిన్న‌టి రోజున అర‌వింద్ ఆ చిత్ర యూనిట్ ను ఇంటికి పిలిపించి గ్రాండ్ గా డిన్న‌ర్ పార్టీ ఇచ్చాడు. రాజ‌మౌళి, బ‌న్నీ పార్టీకి హోస్టులుగా వ్వ‌హ‌రించారు. అశ్విన్ ద‌త్, నాగ్ అశ్విన్, ప్రియాంక ద‌త్, స్వ‌ప్న ద‌త్, కీర్తి సురేష్, విజ‌య్ దేవ‌ర‌కొండ పార్టీలో పాల్గొన్నారు. మ‌రీ పార్టీకి అంత‌గా ప్ర‌త్యేక‌త ఏముంది. ఆ మ‌ధ్య `అర్జున్ రెడ్డి` సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది. ఆటీమ్ కు లేని ఆహ్వానం `మ‌హాన‌టి`కే ఎందుకంటే ఆ స‌క్తిక‌ర అంశాలు బ‌య‌ట‌కొస్తున్నాయి. నాగ్ అశ్విన్ అసాధార‌ణ క్రియేట‌ర్ అని కితాబులందుకున్నాడు.

ఇప్ప‌టికే మెగాస్టార్ చిరంజీవితో `భైర‌వ` అనే సోషియా ఫాంటసీ ఫిల్మ్ చేసేందుకు ఒప్పందం చేసుకున్నాడు. ఇంకా మెగా ఫ్యామిలీలో ఎద‌గాల్సిన హీరోలు….శిఖ‌ర‌స్థానానికి చేరుకోవాల్సిన ఆవ‌శ్య‌క‌త ఉంది. అలాంటప్పుడు ఈ క్రియేట‌ర్ తో మెగా ఫ్యామిలీకి చాలా ప‌నులే ఉన్నాయి. ఇంటికివ‌చ్చి పోయేంత చ‌నువుంటేనే? బాండిగ్ బ‌ల‌ప‌డుతుంది. అప్పుడే అర‌వింద్ అనుకున్న‌వ‌న్నీ జ‌రుగుతాయి. అందుకే ఈ స్పెష‌ల్ పార్టీ అని క్లోజ్ సోర్సెస్ చెవులు కొరుక్కుంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *