అల్లు అర్జున్ ఫ్యాన్స్ .. ఈ అమ్మాయిని రేప్ చేస్తారంట‌.. ఎందుకో తెలుసా..?

టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన తాజా చిత్రం నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా.. తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా విడుదలైన విషయం తెలిసిందే. అయితే ఆ సినిమా బాగోలేదని క్రిటిక్ అపర్ణ ప్రశాంతి రివ్యూ రాసింది. అంతే కేరళ లోని అల్లు అర్జున్ ఫ్యాన్స్ కు ఎక్కడా లేని కోపం వచ్చింది వెంటనే అపర్ణ ప్రశాంతిని రేప్ చేస్తామని బెదిరించ‌డ‌మే కాకుండా.. ఆమెను అమ్మనా బూతులు కూడా తిడుతున్నారు. దాంతో పోలీసులను ఆశ్రయించింది అపర్ణ… పోలీస్ స్టేషన్‌లో కేసు పెట్టినప్పటికీ బన్నీ ఫ్యాన్స్ మాత్రం భయపడటం లేదు క‌దా ఇంకా ఆమెని ట్రోల్ చేస్తూనే ఉన్నారు దాంతో మరోసారి మీడియా ముందుకు వచ్చింది.

ఈ నేప‌ధ్యంలో ఆమె మాట్లుడుతూ.. నేను చేసిన తప్పు కేవలం రివ్యూ రాయడమే.. మలయాళ సూపర్ స్టార్స్ అయిన మోహన్ లాల్, మమ్ముట్టిల‌ చిత్రాలకు కూడా రివ్యూలు రాసాను.. కానీ వాళ్ళ నుండి కానీ ఆ హీరోల ఫ్యాన్స్ కానీ నన్ను ఏమనలేదు. అయితే బన్నీ ఫ్యాన్స్ మాత్రం నన్ను రేప్ చేసి బుద్ధిచెబుదామని అంటున్నారని.., అంతేకాకుండా నా తల్లిదండ్రులను కూడా తిడుతున్నార‌ని.. ఇదేం సంప్రదాయం అంటూ ఆవేదన వ్యక్తం చేస్తోంది.

నా రివ్యూ మీకు నచ్చనంత మాత్రాన నేను దేశ ద్రోహినా… అంటూ ప్రశ్నిస్తోంది. అయితే కొంతమంది అత్యుత్సాహం కలిగిన అభిమానులు చేస్తున్న వెర్రి చేష్టల వల్ల హీరోలకు ఇబ్బంది కలుగుతోంది కానీ ఆ విషయాన్నీ వాళ్ళు మర్చిపోయి మహిళలను టార్గెట్ చేయడం శోచనీయమ‌ని స‌ర్వ‌త్రా చ‌ర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *