బిగ్ బాస్ హోస్ట్ ఎవరు….అసలు ట్విస్ట్ ఏమిటి?

ప్రస్తుతం అందరి దృష్టి బిగ్ బాస్ మీదే ఉంది. బిగ్ బాస్ మొదటి సీజన్ కి యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా చేసాడు. బిగ్ బాస్ మొట్టి సీజన్ ఎంతటి సక్సెస్ సాధించిందో మనకు తెలిసిన విషయమే. ఇక రెండో సీజన్ కి ఎన్టీఆర్ హోస్ట్ గా చేయటం లేదు. ఎందుకంటే ఎన్టీఆర్ సినిమాలతో చాలా బిజీగా ఉన్నాడు. రాజమౌళి సినిమా కూడా చేయటం వలన బిగ్ బాస్ నిర్వాహకులకు హోస్ట్ గా చేయటం కుదరదని ముందే చెప్పేసాడు ఎన్టీఆర్. బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ ఎవరా అనేది స్టార్ మా టివి నిర్వహకులు కూడా అధికారికంగా ప్రకటించలేదు. బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ ఎవరా అనే విషయం మీద రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

మొన్నటి వరకు నాని బిగ్ బాస్ సీజన్ 2కి హోస్ట్ గా చేస్తాడనే వార్తలు వచ్చాయి. ఈ విషయం గురించి నానిని అడిగితే దీని గురించి నేను మాట్లాడితే బాగోదని అనటంతో దాదాపుగా అందరు బిగ్ బాస్ సీజన్ 2 కి నాని హోస్ట్ అని ఫిక్స్ అయ్యిపోయారు.ఇప్పుడు అదిరిపోయే ట్విస్ట్ వైరల్ అవుతుంది. అది ఏమిటంటే బిగ్ బాస్ సీజన్ 2 కి హోస్ట్ గా అల్లు అర్జున్ అనే వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలకు బలం చేకూరుస్తూ బన్ని నా పేరు సూర్య సినిమా తర్వాత మరే సినిమాకి కమిట్ అవ్వకపోవటం… అలాగే బిగ్ బాస్ షో జూన్ లో ప్రారంభం అవుతుంది.

అంతేకాక బన్ని కూడా ఈ ఆమధ్య ముంబై వెళ్లి పారితోషికం వంటి విషయాలను మాట్లాడినట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు. మరి ఆ సంగతి తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే.. ఈ పరిణామాలు చూస్తుంటే నానినే బిగ్ బాస్ హోస్ట్ అని ఫిక్స్ అయిన ఆడియెన్స్ కు సర్ ప్రైజ్ గా బన్నీ పేరు వినిపించడం ఆశ్చర్యంగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *