రంగస్థలం నిర్మాతలకి దిమ్మదిరిగే షాక్..!

స్టార్ సినిమా రిలీజ్ కు ముందు ఎలా పడితే అలా మార్కెటింగ్ చేసుకుంటున్న నిర్మాతలు సినిమా రిలీజ్ తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నా వారు మాత్రం సేఫ్ సైడ్ ఉంటున్నారు. ఇక డిజిటల్ యుగంలో సినిమా రిలీజ్ అయిన కొన్ని వారాలకే ఆన్ లైన్ లోకి వచ్చేస్తుంది. అందులో అమేజాన్ ప్రైం వచ్చాక ఈ స్పీడ్ మరింత పెరిగింది. ఇక రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన రంగస్థలం సినిమా అమేజాన్ ప్రైం వారికి అమ్మేశారు.

సినిమా రిలీజ్ అయిన 45 రోజుల తర్వాత అమేజాన్ ప్రైం సినిమా ఆన్ లైన్ లో పెట్టుకోవచ్చని అగ్రిమెంట్ చేసుకున్నారు. మార్చి 30న రంగస్థలం రిలీజ్ అయ్యింది చరణ్ కెరియర్ లో బ్లాక్ బస్టర్ హిట్ అవగా ఆ తర్వాత వచ్చిన భరత్ అనే నేను హిట్ అయినా రంగస్థలం కలక్షన్స్ ఆపలేకపోయింది. ఇక నా పేరు సూర్య యావరేజ్ గా నిలవగా మహానటి హిట్ అయినా రంగస్థలం ఇంకా థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా ఆడుతుంది.

రంగస్థలం రిలీజ్ అయ్యి ఈరోజుకి 45 రోజులవుతుంది. అమేజాన్ ఒప్పందం ప్రకారం ఈరోజు సినిమాను ఆన్ లైన్ లో పెట్టేస్తారట. ఇప్పటికి రంగస్థలం కొన్ని కేంద్రాలలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతుంది. ఇలాంటి టైం లో సినిమా ఆన్ లైన్ లో రావడం ఫ్యాన్స్ కు నచ్చలేదు. ఇదే విషయాన్ని నిర్మాతల దగ్గర ప్రస్థావించగా అమేజాన్ వారితో చర్చలు జరిపారట. అగ్రిమెంట్ బ్రేక్ చేసి మరో రెండు వారాలు ఆగాలని కోరారట. అయితే అమేజాన్ వారు మాత్రం ఈ సినిమాకు అలా చేస్తే మిగతా వాటికి ఆ ఛాన్స్ ఉంటుందని అలా కుదరదని చెప్పారట. నిర్మాతల తొందరపాటు వల్ల రంగస్థలం త్వరగానే ఆన్ లైన్ లోకి వస్తుందన్నమాట. స్టార్ సినిమా కనీసం ఓ పదివారాల దాకా అగ్రిమెంట్ చేసుకుండా ఉంటే బెటర్ అని రంగస్థలం చూశాక తెలుస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *