అందరికి చుక్కలు చూపిస్తున్న బాబు గోగినేని … షాక్ అవుతున్న సెలబ్రెటీలు

బిగ్ బాస్ రోజులు గడుస్తున్న కొద్దీ రసకందాయంలో పడుతోంది. కొత్త కొత్త టాస్క్ లతో ఆసక్తి రేపుతోంది. మొన్న మొదలైన యజమానులు-సేవకుల టీం నిన్న కూడా కొనసాగింది. యజమానుల టీంతో తమ పనులు చేయించుకోవడంతో పాటు ప్రేక్షకులకు వినోదం పంచేందుకు జంబలకిడి పంబ బ్యూటీ షోను బుధవారం నిర్వహించారు.ఇందులో భాగంగా సేవకుల టీం సభ్యుల్లో ఆడవారు మగవేషాల్లో.. మగవారు ఆడవేషాల్లో ర్యాంప్ షో నిర్వహించారు. అయితే హేతవాది బాబు గోగినేని మాత్రం ఈ ఫ్యాషన్ షోల్లో పాల్గొనేందుకు నిరాకరించారు. తాను ఫ్యాషన్ షోలకు వ్యతిరేకమని.. ఇందులో పాల్గొనబోను అని తప్పుకున్నారు.ఫ్యాషన్ షోలకు తాను వ్యతిరేకం అని చెప్పిన బాబు గోగినేని ఒక్కడే ఒంటరిగా బిగ్ బాస్ ఇంట్లో ఉండి పోయాడు.

అయితే ఫ్యాషన్ షో ముగిసిన అనంతరం ఇంటిలోకి వచ్చిన సభ్యులు రైస్ కుక్కర్ ప్లగ్ పీకి ఉండటం చూసి ఆగ్రహానికి గురయ్యారు. ఈ పని చేసింది బాబు గోగినేని అంటూ ఫైర్ అయ్యారు. దీనికి సీరయస్ అయిన బాబు గోగినేని ‘కుక్కర్ ప్లగ్ పీకేసి.. అన్నం అవ్వకుండా ఇబ్బంది పెట్టే చిల్లర పనులు చేసే రకం తాను కాదని’ వివరణ ఇచ్చారు.

బాబూ గోగినేని వ్యవహారం బిగ్ బాస్ నిర్వాహకులకు, ఇంటిలోని సెలెబ్రెటీలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఆయన బయట ఎలాగైతై అందరినీ ఏకిపారేస్తూ హితబోధ చేస్తుంటాడో బిగ్ బాస్ ఇంట్లో కూడా అదే విధంగా అందరికీ క్లాస్ పీకుతున్నాడు. అంతేకాదు.. ఇంటిలోని సభ్యులంతా బిగ్ బాస్ ఇచ్చిన ఆదేశాలను తూ.చా తప్పకుండా పాటించాలి.

కానీ బాబు గోగినేని వాటన్నింటిని బ్రేక్ చేస్తున్నాడు. మొన్న సంజన ఇచ్చిన పనులను చేయకుండా మొండికేశాడు. ఏకంగా ఆమెకే వార్నింగ్ ఇచ్చాడు. మేం బానిసలం కాదు అంటూ హెచ్చరించాడు. అంతేకాదు కావాలంటే నా మీద డిస్ లైక్ పెట్టుకో అంటూ బిగ్ బాస్ ఆదేశాలనే ధిక్కరించాడు.

ఇక నిన్న ఏకంగా బిగ్ బాస్ టీం ఇచ్చిన జంబలకిడి పంబ ర్యాంప్ షోలో పాల్గొనడానికి బాబు గోగినేని నో చెప్పాడు. తాను హేతువాదినని.. ఇలాంటి షోలకు వ్యతిరేకం అంటూ తేల్చిచెప్పాడు. కామెడీ షోలకు వచ్చి బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు చేయనంటూ మొండికేసిన మొదటి కంటెస్టెంట్ బాబు కావడం విశేషంగా చెప్పవచ్చు.

బిగ్ బాస్ పుట్టిందే ప్రేక్షకులకు ఎంటర్ టైన్ మెంట్ ఇవ్వడానికి.. అలాంటిది సెలబ్రెటీగా ఎంటర్ అయిన బాబు గోగినేని బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లు చేయకుండా ఓ మూలన కూర్చోవడంతో నిర్వాహకులు తలపట్టుకుంటున్నారు. బాబును తీసుకొని తప్పు చేశామని వారు కుమిలిపోతున్నారట..

ఇంటి సభ్యులు కూడా బాబు గోగినేనికి ఏదైనా పని చెబుతామంటే దడుసుకుంటున్నారు. ఆయన ముఖం మీదే నేను చేయను.. ఏం చేసుకుంటారో చేసుకోండని తెగేసి చెబుతున్నారు. ఇలా బిగ్ బాస్ కామెడీ షోలో సీరియస్ పర్ ఫామెన్స్ తో బాబు గోగినేని అందరికీ షాకుల మీద షాకులు ఇస్తున్నారు. ఆయన హేతుబద్దత బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చాక కూడా పోవడం లేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *