బిగ్ బాస్-2లో ఆ జబర్దస్త్ కమెడియన్ ఉంటే..!

బిగ్ బాస్-2 మొదలైంది.. నాని హోస్టింగ్ ఎన్.టి.ఆర్ రేంజ్ తో పోల్చకుంటే పర్వాలేదు అన్నట్టు ఉంది. నాని మార్క్ తెలియాలంటే కనీసం ఓ రెండు మూడు ఎపిసోడ్స్ చూడాల్సిందే. ఇక కంటెస్టంట్స్ కూడా వీళ్లు సెలబ్రిటీసా అన్నట్టుగా ఉన్నారు. రెగ్యులర్ గా ప్రేక్షకులకు తెలిసిన వారు బిగ్ బాస్ హౌజ్ లోకి వచ్చింది యాంకర్ శ్యామలా, గీతా మాధురి అంటూ ఇలా ఒకరిద్దరు మాత్రమే అని చెప్పాలి.

బిగ్ బాస్ మొదటి సీజన్ లో దాదాపు అందరు తెలిసిన వారినే పెట్టారు. ముఖ్యంగా జబర్దస్త్ నుండి వచ్చిన ధన్ రాజ్ బిగ్ బాస్ సీజన్ 1లో అందరిని అలరించాడు. టివి షోలలో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన రియాలిటీ షో జబర్దస్త్ ఆ షోలోని ఒకరిద్దరిని ఈ సీజన్ బిగ్ బాస్ లోకి తీసుకుంటే బాగుండేదని అంటున్నారు.ఒకవేళ వైల్డ్ కార్డ్ లో వారినెవరినైనా తీసుకుంటారా అన్న వార్తలు కూడా వస్తున్నాయి. జబర్దస్త్ షోలో సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, హైపర్ ఆదిలు మంచి క్రేజ్ తెచ్చుకున్నారు. బిగ్ బాస్-2 లో ఈసారి వీరెవరైనా ఉంటే భలే మజా వచ్చేది. సుధీర్, ఆది ఎవరున్నా సరే ఆడియెన్స్ ఎంజాయ్ చేసేవారేమో.

బిగ్ బాస్ కోసం వారు జబర్దస్త్ ను నెగ్లెక్ట్ చేయలేరు. మరి ఈసారి బిగ్ బాస్ లో ఉన్న ఈ 16 మంది కంటెస్టంట్స్ ఎలా ఆడియెన్స్ ను అలరిస్తారో చూడాలి. ఈసారి కొత్తగా ముగ్గురు కామన్ మెన్ ను తీసుకున్నారు. ఈ సెలబ్రిటీస్ తో వారు ఎలా కలివిడిగా ఉంటారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *