బిగ్ బాస్-2 అందరికి శత్రువవుతున్న ఆమె..!

బిగ్ బాస్-2 నాని హోస్ట్ గా మొదలవగా 16 మంది కంటెస్టంట్స్ తో ఆదివారం షో మొదలైంది. అందులో కొందరు అందరికి తెలిసిన వారైతే మరికొందరు మాత్రం ఎవరో తెలియని వారు. దానికితోడు వారి సరసన ముగ్గురు కామన్ మెన్ కు ఛాన్స్ ఇచ్చారు. సెలబ్రిటీస్ ఏమో కాస్త టెక్కు చూపిస్తుంటే కామన్ మెన్ కాస్త కూల్ గా ఉన్నారు.

ఇప్పుడిప్పుడే హౌజ్ లో గొడవలు మొదలవుతున్నాయి. ముఖ్యంగా మోడలింగ్ నుండి బిగ్ బాస్ హౌజ్ కు సెలెక్ట్ అయిన సంజనా తన ప్రవర్తనతో అందరిని ఆశ్చర్యపరుస్తుంది. పక్కా గేమ్ ప్లాన్ తో ఆమె హౌజ్ లోకి వచ్చినట్టు తెలుస్తుంది. రెండు రోజులు జైల్లో బందీ అయిన సంజనా తను అక్కడ ఉండేందుకు కారణమైన వారిపై కక్ష్య కట్టింది అంతేకాదు నిన్న జరిగిన లక్సరీ బడ్జెట్ గేమ్ లో ఆమె బాబు గోగినేనితో గొడవ పెట్టుకుంది. కావాలని చేస్తుందా లేక తెలియక చేస్తుందా తెలియదు కాని సంజనా మాత్రం హౌజ్ లో ఉండే వారికి దూరమవుతుంది. హౌజ్ లో ఆమె ప్రవర్తన అలా ఉందని చెప్పొచ్చు. మోడల్ గా కెరియర్ కొనసాగిస్తున్న సంజనా బిగ్ బాస్ హౌజ్ నుండి సెలబ్రిటీగా బయటకు రావాలని ఫిక్స్ అయినట్టు ఉంది.

ఇక హౌజ్ లో ఇప్పటివరకు గీతా మాధురి, శ్యామలా, భాను శ్రీ ఉన్నారు అంటే ఉన్నారన్నట్టుగా కనిపిస్తున్నారు. వారు ఏమాత్రం హౌజ్ మెంబర్స్ తో కలిసి మాట్లాడిన సందర్భాలు కనబడలేదు. బిగ్ బాస్-2 ఏదైనా జరగొచ్చని అంటున్న నాని ఏం జరుగుతుందో మాత్రం సస్పెన్స్ గా ఉంచుతున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *