డైరెక్టర్ చెంప చెల్లుమనిపించిన బిగ్ బాస్ భామ!

ఈ మద్య సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ (పడక సుఖం) పెను వివాదాలకు దారి తీస్తుంది. తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ బాగా జరుగుతుందని నటి శ్రీరెడ్డి భారీ ఎత్తున పోరాటం చేసిన విషయం తెలిసిందే. ఇండస్ట్రీల చిన్న స్థాయి నుంచి పెద్దల వరకు పడక సుఖం ఇస్తేనే సినిమా చాన్స్ వస్తుందని ఎంతో మంది జీవితాలతో ఆడుకుంటున్నారని శ్రీరెడ్డి ఆరోపిస్తుంది. అయితే సినిమా ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉందన్న విషయంపై పలువురు హీరోయిన్లు సైతం తమ ఆవేదన వెలుబుచ్చారు.

తాజాగా బిగ్ బాస్ 2 సీజన్ మొదలైంది..ఇందులో 16వ కంటెస్టంట్ గా విజయవాడకు చెందిన అమ్మాయి మోడల్ సంచన అన్నె సెలక్ట్ అయిన విషయం తెలిసిందే. ఈ అమ్మడు బిగ్ బాస్ లోకి ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచి ఫైర్ బ్రాండ్ అయ్యిందని కామెంట్స్ వస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్ లోకి ఎంట్రీ కాకముందో ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.సినీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న సమయంలో తనను ఓ డైరెక్టర్ కమిట్మెంట్ గురించి అడిగాడని.. దాంతో అతన్ని లాగిపెట్టి కొట్టానని చెప్పుకొచ్చింది. సినిమా చాన్స్ కోసం ఫోటోలు పంపమంటే పంపానని..తర్వాత ఆయన మాటల్లో ఏదో తేడా కనిపించడంతో తాను అలర్ట్ అయ్యానని చెప్పింది. అంతే కాదు ఇండస్ట్రీ గురించి తెలుసు కదా అంటూ ఏదో అడగబోయాడని.. డేట్స్ ఇచ్చినప్పుడు అందుబాటులో ఉండాలని కూడా అన్నాడన్నది.

ఓ రోజు తనను ఆఫీస్ కి రావాలని మేనేజర్ ద్వారా ఫోన్ చేయించాడని..దాంతో తన అన్నయ్య, అక్కలను కూడా వెంట బెట్టుకొని వెళ్లానని..దాంతో అతని చాలా కోపం వచ్చి ఒక్కరి రమ్మంటే ఈ గుంపు తీసుకు వచ్చావేంటీ అంటూ సీరియస్ అయ్యారని చెప్పింది. తనకు కమిట్ మెంట్ ఇస్తే..పెద్ద హీరోతో క్లాప్ కొట్టించడం, ముంబైలో ఫ్లాట్, డబ్బులు ఇలా చాలా ఆశలు చూపించారని.. వేటికీ లొంగకపోవడంతో.. డైరెక్టరే స్వయంగా ముందుకు వచ్చాడన్నారు. తనకు కో ఆపరేట్ చేస్తే..తన లైఫ్ మొత్తం మారుస్తానని చెప్పండంతో చిర్రెత్తుకొచ్చి లాగి చెంప మీది ఒక్కటిచ్చానని చెప్పింది సంజనా అన్నె.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *