బిగ్ బాస్ సీజ‌న్-2 సెట్ ఎక్కడో తెలుసా…?

జూనియ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాత‌గా వ్య‌వ‌హ‌రించిన‌ బిగ్ బాస్ రియాల్టీ షో తెలుగులో మంచి స‌క్సెస్ సాధించిన సంగ‌తి తెలిసిందే. ఊహించ‌ని రీతిలో టీఆర్పీ రేటింగ్స్ రికార్డుల‌ను బ‌ద్ద‌లు కొట్టిన ఈ షో..సీజ‌న్-2 కు ముస్తాబ‌వుతోంది. బిగ్ బాస్-2 హోస్ట్ గా హీరో నాని వ్య‌వ‌హ‌రించ‌బోతున్నారంటూ ప్ర‌చారం కూడా పెద్ద ఎత్త‌న సాగుతోంది.ఇక తొలి సీజ‌న్ దిగ్విజ‌యం అయ్యేందుకు ఎన్టీఆర్ పడ్డ క‌ష్టం అంతా ఇంతా కాదు. జ‌నాల‌కు ఏ మాత్రం బోర్ కొట్ట‌డకుండా 70 రోజుల పాటు అల‌రించ‌డంలో ఎన్టీఆర్ పాత్ర కీల‌కం.ఆయ‌న వారానికి రెండు రోజులు(శ‌ని,ఆది)క‌నిపించి, అల‌రించ‌డం ఆ షోకు మ‌రో హైలైట్.ఇక పార్టిసిపెంట్స్ కూడా అంతే స్థాయిలో అద‌ర‌గొట్టారనుకోండి…

ఈసారి అన్నపూర్ణ 7 ఎకర్స్ లోనే…

అయితే, తాజాగా తెలుగులో బిగ్ బాస్ సీజ‌న్-2కు ఏర్పాట్లు జ‌రుగుతున్న‌ట్లు వినికిడి. తొలి సీజ‌న్ సెట్ ను పూణెలో వేసిన బిగ్ బాస్ యాజ‌మాన్యం ఈసారి రెండో సీజ‌న్ ను హైద‌రాబాద్ లోనే నిర్వ‌హించ‌నుంద‌ని స‌మాచారం.అది కూడా న‌గ‌ర న‌డిబొడ్డున అన్న‌పూర్ణ స్టూడియోస్ కు సంబంధించిన 7 ఎకర్స్ లోనే ఆల్ మోస్ట్ సెట్ సిద్ద‌మైన‌ట్లు కృష్ణాన‌గ‌ర్ వ‌ర్గాల స‌మాచారం.అయితే దీనికి సంబంధించి ఇంకా అధికారిక ప్ర‌క‌ట‌న మాత్రం రాలేదు.కానీ దీనికి సంబంధించిన అనేక వివ‌రాలు మాత్రం హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి.

పార్టిసిపెంట్స్ వీళ్లేన‌ట‌..?

ఈ సీజ‌న్-2 లో పార్టిసిపేట్ చేసే వారి పేర్లు కూడా వైర‌ల్ అవుతున్నాయి.వారిలో ఐస్ క్రీమ్ బ్యూటీ తేజ‌స్వి,సింగ‌ర్ గీతా మాధురి,సీనియ‌ర్ హీరోయిన్ రాశి,హీరోయిన్ గ‌జాలాతో పాటు యాంక‌ర్ శ్యామ‌లా కూడా ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.ఇక వీరితో పాటు కాంట్ర‌వ‌ర్సీకి కేరాఫ్ అయిన వారిని కూడా ఎంపిక చేసే ప‌నిలో యాజ‌మాన్యం ఉన్న‌ట్లు టాక్. కాస్టింగ్ కౌచ్ పై సంచ‌ల‌నం రేకెత్తించిన శ్రీరెడ్డి కూడా ఈ జాబితాలో ఉన్న‌ట్లు వార్త‌లు వ‌చ్చాయి.కానీ తాజాగా ఆమె బిగ్ బాస్ -2 లో పార్టిసిపేట్ చేసేందుకు విముఖ‌త వ్యక్తం చేసిన‌ట్లు తెలుస్తోంది.

నానిపై భారీగా అంచ‌నాలు..

ఇక‌పోతే, బిగ్ బాస్ తొలి సీజ‌న్ పై మొద‌ట్లో మంచి టాక్ వ‌చ్చింది.కానీ కొద్ది రోజుల త‌ర్వాత జ‌నాల‌కు కాస్త బోరింగ్ అనిపించింది.శ‌ని,ఆది వారాలు మిన‌హా మిగ‌తా రోజుల్లో పార్టిసిపెంట్స్ అంత‌గా అల‌రించ‌లేద‌ని, కానీ క్లైమాక్స్ ద‌శ‌కు చేరుకున్నాక మాత్రం మ‌ళ్లీ షో పుంజుకుంది అన్న విమ‌ర్శ‌లు ఉన్నందున‌, ఈ సారి మ‌రింత ర‌క్తి క‌ట్టించేందుకు బిగ్ బాస్ యాజ‌మాన్యం త‌మ వ్యూహాల‌కు ప‌దును పెడుతున్నారు. మ‌రింత కొత్త‌గా ఉండేలా ప్లాన్ చేస్తున్న‌ట్లు టాక్. ఇక ఈ షోలో పార్టిసిపెంట్స్ ఎంత ర‌చ్చ చేస్తార‌న్న‌ది ప‌క్క‌న‌పెడితే, హీరో నాని ఎంత వ‌ర‌కు స‌క్సెస్ అవుతాడు, షోను స‌క్సెస్ చేస్తాడు అనేది ఆస‌క్తిగా మారింది.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *