నాని కాదు ఆ బిగ్ స్టార్.. బిగ్ బాస్ కొత్త హోస్ట్ అతనే..!

బిగ్ బాస్ రియాల్టీ షో మొదట హిందీలో ప్రారంభం అయ్యి సూపర్ డూపర్ హిట్ అయ్యి ఆ తరవాత ప్రాంతీయ భాషలకు విస్తరించింది. తెలుగు,తమిళ,కన్నడ ఇలా అన్ని భాషల్లోనూ ఈ షో సూపర్ డూపర్ హిట్ అయ్యింది. తెలుగులో బిగ్ బాస్ సీజన్ 1 ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే. యాంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించిన ఈ షో TRP రేటింగ్స్ టాప్ లో ఉండేవి. ఎన్టీఆర్ వాక్ చాతుర్యం, పార్టిసిపేట్స్ ఇలా కార్యక్రమం మొత్తం చివరి వరకు రక్తి కట్టించింది. మొదట్లో ఈ షో ని ఎన్టీఆర్ ఎలా నడిపిస్తాడా అని సందేహపడిన వారికీ మొదటి ఎపిసోడ్ లోనే దిమ్మదిరిగే సమాధానం ఇచ్చాడు ఎన్టీఆర్. బిగ్ బాస్ సీజన్ 1 అంత హిట్ అవ్వటానికి ఎన్టీఆర్ కారణమని చెప్పవచ్చు.

దాంతో సెకండ్ సీజన్ కి కూడా ఎన్టీఆర్ ని కంటిన్యూ చేస్తారని అందరు భావించారు. అయితే ఎన్టీఆర్ సినిమాలతో బిజీగా ఉండుట వలన బిగ్ బాస్2 చేయలేనని ముందుగానే ఎన్టీఆర్ బిగ్ బాస్ నిర్వాహకులకు చెప్పేశాడట.

దాంతో బిగ్ బాస్ నిర్వాహకులు నేచురల్ స్టార్ నానిని హోస్ట్ గా ఎంపిక చేశారనే కధనాలు వచ్చాయి. నాని కన్ఫర్మ్ అని కొన్ని మీడియా సంస్థలు తేల్చేశాయి. కానీ ఈ విషయం గురించి అఫీషియల్ గా ప్రకటన ఏమి రాలేదు.

దాంతో బిగ్ బాస్ 2సీజన్ హోస్ట్ గా ఎవరు ఉంటారనే విషయం మీద కొంత సస్పెన్స్ నెలకొంది. అయితే లేటెస్ట్ గా వినిపిస్తున్న కధనం ప్రకారం మెగా హీరోల్లో ఒకరు బిగ్ బాస్ కి హోస్ట్ గా వ్యవహరిస్తారట. మెగా హీరోల్లో బాగా యాక్టివ్ గా ఉంటూ నవరసాలు పండించగల దిట్టగా పేరొందిన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బిగ్ బాస్ 2 ని నడిపించే రధసారధిగా ఫైనల్ అయినట్టు వార్తలు వస్తున్నాయి.ఇప్పటికే బిగ్ బాస్ నిర్వాహకులు బన్నితో సంప్రదింపులు జరిపినట్టు సమాచారం. నా పేరు సూర్య సినిమా తర్వాత మరో సినిమా కమిట్ కానీ బన్ని వెంటనే ఈ అఫర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తుంది.అల్లు అర్జున్ కొత్త ప్రాజెక్ట్ పట్టాలెక్కాలంటే కనీసం మూడు,నాలుగు నెలల సమయం పడుతుంది. ఈ లోపు బిగ్ బాస్ 2 అయ్యిపోతుంది. డేట్స్ ఎడ్జెస్ట్ చేయవలసిన పని కూడా లేకపోవటంతో మరో ఆలోచన లేకుండా బన్ని బిగ్ బాస్ అఫర్ ని ఒకే చేసేసాడట.

ఇక రెమ్యునరేషన్ విషయానికి వస్తే తాను ఒక్కో సినిమాకి ఎంత తీసుకుంటాడో అంతే డిమాండ్ చేసినట్టు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తారక్ కి ఇచ్చినట్టుగానే బన్నికి కూడా పారితోషికాన్ని ఇస్తామని బిగ్ బాస్ నిర్వాహకులు చెప్పారట. ఈ డీల్ ఒకే అయితే యంత్రం బిగ్ బాస్ 2సీజన్ కి అదిరిపోయే హోస్ట్ దొరికినట్టే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *