పెను ప్రమాదం నుండి బయటపడ్డ జబర్దస్త్ కమెడియన్..

జబర్దస్త్ షో తో బాగా పేరు తెచ్చుకున్న చలాకి చంటి..తాజాగా పెను ప్రమాదం నుండి ప్రాణాలతో బయటపడినట్లు తెలుస్తుంది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి వస్తున్న చంటి కారు 44వ జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న మరో కారు బలంగా ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో రెండు కార్లు పూర్తిగా ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదం నుండి చంటి తోపాటు మరో కార్ లో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా బయటపడడం తో అందరూ ఉపిరి పీల్చుకున్నారు. ఈ ఘటన తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ఆరా తీస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *