బిగ్ బాస్ లో ఇవి గమనించారా….ఎలా దొరికిపోయారో చూడండి

బిగ్ బాస్ అనగానే అసలైన సిసలైన రియాల్టీ షో అని అంటారు. హిందీలో అయితే బిగ బాస్ 10 సీజన్ లు దాటిపోయింది. తెలుగులో బిగ్ బాస్ రెండో సీజన్ ప్రారంభం అయింది. బిగ్ బాస్ మొదటి సీజన్ ఎన్టీఆర్ హోస్ట్ గా బాగా సక్సెస్ అయ్యింది. మొదటి సీజన్ TRP పరంగాను,కమర్షియల్ గాను బాగా సక్సెస్ ని సాధించింది. అందుకే బిగ్ బాస్ సీజన్ ఇంకా బాగుండాలని అనేక చర్లను తీసుకున్నారు. బిగ్ బాస్ హౌస్ ని పూణేలో కాకుండా హైదరాబాద్ లో అన్నపూర్ణ స్టూడియోలో నిర్మించారు. అంతేకాకుండా సెలబ్రెటీలతో పాటు సాధారణ వ్యక్తులను కూడా పార్టిసిపెంట్స్ గా తీసుకున్నారు. ఎంత గొప్ప కార్యక్రమం అయినా ప్రేక్షక ఆదరణ ఉండాలి.

అయితే ఏ కార్యక్రమంలోనైనా పొరపాట్లు జరగటం అనేది సహజమే. బిగ్ బాస్ అనేది పక్కా రియాల్టీ షో అని విస్తృతంగా ప్రచారం చేసారు. ఎంత రియాల్టీ షో అయినా మొదటి సీజన్ లో కొన్ని తప్పులను ప్రేక్షకులు గుర్తించారు. బిగ్ బాస్ హౌస్ లో వాషింగ్ మెషిన్ కనపడటం అప్పట్లో కలకలం రేపింది.

రూల్ ప్రకారం ఎవరి బట్టలు వాళ్లే ఉతుక్కోవాలి. సరే ఎవరి బట్టలు వాళ్లే వాషింగ్ మిషన్ లో ఉతికేసుకున్నారని అనుకుందాం. అయితే ప్రిన్స్ కి ఇచ్చిన పనిష్ మెంట్ ప్రకారం హౌస్ లో ఉన్న అందరి బట్టలను ఉతకాలని చెప్పారు. అలాంటప్పుడు వాషింగ్ మెషిన్ ఎందుకని దుమారం రేగింది. మొదటి సీజన్ లో వలె ఈ సుజన్ లో కూడా కొన్ని తప్పులను నెటిజన్స్ ఎత్తి చూపుతున్నారు.

బాబు గోగినేని చపాతీలను చేస్తున్నట్టు చూపించారు. అయితే అక్కడ పొయ్యి వెలగటం లేదు. ఎక్కడో కాల్చి తెచ్చిన చపాతీలను పెనం మీద వేసినట్టు అనుమానాలు వస్తున్నాయి. బాబు గోగినేని చపాతీలు కాల్చుతూ ఉంటే లేడి పార్టిసిపెంట్ చపాతీలను చేస్తూ ఉంటుంది. కానీ చపాతి కర్రకు ఏ మాత్రం పిండి అంటలేదు.

అలాగే కాల్చిన చపాతీలు కూడా చాలానే కనపడుతున్నాయి. కర్రతో చపాతి చేసినప్పుడు పిండి అంటుకోవాలి కదా అని నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు. ఇదంతా చూస్తూ ఉంటే బిగ్ బాస్ పక్కా స్క్రిప్ట్ ప్రకారమే జరుగుతుందని భావించాలని సాధారణ ప్రేక్షకుడు సైతం అనుకుంటున్నాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *