త్వరలో త్రిష పెళ్లి చేసుకోబోతుందా? వరుడు ఎవరో తెలుసా..?

తెలుగు ఇండస్ట్రీలో ‘వర్షం’ చిత్రంతో ఎన్నాళ్లకు గుర్తొచ్చానా వానా అంటూ కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన హీరోయిన త్రిష తర్వాత తెలుగు, తమిళ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించి నెంబర్ వన్ రేస్ లోకి వెళ్లింది. హీరోయిన్ గా ఎంత స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నా..త్రిష వ్యక్తిగతంగా ఎన్నో వివాదాలకు కేంద్రబింధువుగా నిలిచింది. ఈ మధ్య కాలంలో హీరోయిన్లు వరస పెట్టి పెళ్లిళ్లు చేసుకొంటూ ఉన్నారు. బాలీవుడ్, టాలీవుడ్ హీరోయిన్ల పెళ్లి వార్తలు వరసగా వస్తూనే ఉన్నాయి.

సమంత, అనుష్కా శర్మ, సోనమ్ కపూర్, నేహా ధూపియా.. ఇలా వీళ్లంతా ఇటీవలి కాలంలో పెళ్లిళ్లు చేసుకున్నారు. త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందని సమాచారం. ఇండస్ట్రీకి వచ్చి ఇప్పటికే దశాబ్ధంన్నర కాలం పూర్తి అయినా ఇప్పటికీ అవకాశాలు పొందుతోంది త్రిష. సీనియర్ హీరోల సరసన ఈమెకు అవకాశాలు వస్తున్నాయి. ఇప్పుడు వయసు కూడా 35 సంవత్సరాలు.

ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈమె పెళ్లి ప్రయత్నాల్లో ఉందని టాక్. ఆ మధ్య ఒక వ్యాపారవేత్తతో త్రిష ఎంగేజ్ మెంట్ కూడా జరిగింది. అయితే పెళ్లి వరకూ వెళ్లలేదు ఆ నిశ్చితార్థం. ఇప్పుడు మరో వ్యాపారవేత్తతో త్రిష ప్రేమలో ఉందని.. త్వరలోనే అతడిని పెళ్లి చేసుకోబోతోందని కూడా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయాన్ని త్రిష కానీ ఆమె తల్లి కానీ ధ్రువీకరించలేదు.

 

గతంలో త్రిష పెళ్లి.. నిశ్చితార్థంతో ఆగిపోయింది. ఆపై సినిమాలపై త్రిష దృష్టి పెట్టినా.. పెద్దగా అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు. ఇటీవల స్నేహితులతో కలిసి త్రిష విదేశాలకి వెళ్లి వచ్చింది. అక్కడ భారీస్థాయిలో షాపింగ్ చేసింది. ఇది కచ్చితంగా అది వెడ్డింగ్ షాపింగేనని సమాచారం. త్రిష కొంతకాలంగా వ్యాపారవేత్తతో చనువుగా వుంటున్నట్లు గుసగుసలు వినబడుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *