ఎవరి యాంకరింగ్ బెటర్…ధన్ రాజ్ ఏమన్నాడో చూడండి

బిగ్ బాస్ మొదటి సీజన్ లో ధన్ రాజ్ పార్టిసిపేట్ చేసాడు. అప్పుడు ఎన్టీఆర్ హోస్ట్ గా చేసాడు. ఇప్పుడు ప్రారంభం అయినా బిగ్ బాస్ సీజన్ 2 లో హోస్ట్ గా నాని చేస్తున్నాడు. ఈ సందర్భంగా ధన్ రాజ్ బిగ్ బాస్ హోస్ట్ ఎవరు బెస్ట్ అనే విషయం గురించి తన అభిప్రాయాన్ని చెప్పాడు. బిగ్ బాస్ 1 కి బిగ్ బాస్ 2కి తేడా ఏమిటని అడిగితే….బయట ప్రపంచానికి ఎంత తెలుసో నాకు అంతే తెలుసునని చెప్పుతూ…. బిగ్ బాస్ రెండో సీజన్ మొదటి రోజు మాత్రమే చూశానని,పార్టిసిపెంట్స్ హౌస్ లోపలకు వెళ్ళటం చూశానని చెప్పాడు. బిగ్ బాస్ హోస్టింగ్ అంటే ఇలా ఉండాలనే మార్క్ ని క్రియేట్ చేసాడు తారక్. నాని ప్రారంభంలోనే ఉన్నాడు.

అలాగే ఒకరు చేసిన తర్వాత మరొకరు చేసినప్పుడు ఒక రకమైన భయం ఉంటుంది. అంతేకాక ఎన్టీఆర్ తో నానిని పోల్చుతూ ఉంటారు. నాని తన స్టైల్ లో చేస్తాడు. ఎన్టీఆర్,నాని ఇద్దరు ఎవరి స్టైల్ లో వారు చేసారు.

ఇద్దరి మధ్య కంపేరిజన్ లేదు. ఏమి జరుగుతుందో అని నేను కూడా మీతో పాటు వెయిట్ చేస్తున్నాను. ఎందుకంటే బిగ్ బాస్ షో అనేది ఒక్క రోజుతో అయ్యేది కాదు కదా…అంటూ ధన్ రాజ్ చెప్పాడు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *