గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిన మహానటి డైరెక్టర్

మహానటి చిత్రంతో తెలుగువాడి సత్తా చాటిన యువ దర్శకుడు నాగ్ అశ్విన్ కు గోల్డెన్ చాన్స్ వచ్చింది . మూడో సినిమాకే మెగాస్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేసే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసాడు . ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్ మొదటి ప్రయత్నంలోనే అందరి అందరి ప్రశంసలు అందుకున్నాడు . కాగా రెండో చిత్రంతో మహానటి వంటి క్లాసికల్ చిత్రాన్ని డైరెక్ట్ చేసి విమర్శకుల ప్రశంసలతో పాటుగా ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటున్నాడు .

మహానటి బ్లాక్ బస్టర్ కావడంతో నాగ్ అశ్విన్ తదుపరి చిత్రం ఏదై ఉంటుందా అని అనుకుంటుండగా మహానటి వంటి గొప్ప చిత్రాన్ని చేసిన నాగ్ అశ్విన్ తో తన తదుపరి చిత్రాన్ని చేయడానికి ఉత్సాహంగా అంగీకరించాడు చిరంజీవి . అసలు మహానటి విడుదల కాకముందే చిరంజీవితో పాతాళ భైరవి వంటి జానపద చిత్రం చేయాలనీ చిరంజీవి కి కోరికగా ఉందట విచిత్రం ఏంటంటే నాగ్ అశ్విన్ కూడా అలాంటి కథ నే రెడీ చేసుకునే పనిలో ఉండటం .

టైం మిషన్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట ! ప్రస్తుతం నాగ్ మహానటి సక్సెస్ జోష్ లో ఉన్నాడు . కొద్దిరోజుల తర్వాత చిరంజీవి కోసం పూర్తస్థాయి కథ రెడీ చేయనున్నాడట నాగ్ అశ్విన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *