దర్శకుడి ఆత్మహత్యాయత్నం.. ఇండస్ట్రీ షాక్!

ఎన్నో ఆశలతో, కలలతో సినిమా ఇండస్ట్రీలోకి వస్తుంటారు. తమకు నచ్చిన విభాగంలో పేరు తెచ్చుకోవాలని ఎంతో ప్రయత్నిస్తుంటారు. ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలంటే.. టాలెంట్ తో పాటు అదృష్టం కూడా ఉండాలి. ఒక్కోసారి టాలెంట్ ఉన్నా.. లక్ ఫేవర్ చేయక అవకాశాలు పోగొట్టుకున్న వారు కోకొల్లలు. ‘ఒక్క అమ్మాయి తప్ప’ చిత్రంతో దర్శకుడిగా టాలీవుడ్ కు పరిచయమయ్యాడు రాజసింహ.

ఇంటర్ చదువుకునే రోజుల్లోనే సినిమాల మీద ప్యాషన్ ఉండేది. అదే ప్యాషన్ తో ఇండస్ట్రీలో అగుడుపెట్టిన రాజసింహ గోస్ట్ రైటర్ గా ఎన్నో సినిమాలకు పని చేశాడు. ‘రుద్రమదేవి’ సినిమాలో అల్లు అర్జున్ పోషించిన గోనగన్నారెడ్డి పాత్రకు తెలంగాణా యాసలో డైలాగ్స్ రాసింది రాజసింహనే.. ఈ సినిమాతో ఆయనకు కొంత పాపులారిటీ దక్కింది.

అయితే ఇండస్ట్రీలో సరైన బ్రేక్ మాత్రం రాలేదు. కెరీర్ , కొన్ని వ్యక్తిగత విషయాల కారణంగా డిప్రెషన్ లోకి వెళ్ళిన రాజసింహ సూసైడ్ అటెంప్ట్ చేయడం షాకింగ్ గా మారింది. నిద్రమాత్రలు మోతాదుకి మించి తీసుకొని ఆత్మహత్యాయత్నం చేశారు. వెంటనే హాస్పిటల్ కు తరలించడంతో ప్రమాదం తప్పింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *