బిగ్ బాస్ 2 లో గీతామాధురి రెమ్యూనరేషన్ తెలిస్తే షాక్..!

తెలుగు బుల్లితెరపై నేచురల్ స్టార్ నాని హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 ప్రారంభం అయ్యింది. ఆది ఈ ప్రోగ్రామ్ ఎంతో అట్టహాసంగా మొదలైంది. ఇందులో పదహారు మంది కంటెస్టంట్లు పాల్గొన్నారు. సాధారణంగా బిగ్ బాస్ లో పాల్గొన్న కంటెస్టంట్లకు వారి స్థాయిని బట్టి రెమ్యూనరేషన్ ఇవ్వడం జరుగుతుంది.

బాలీవుడ్ లో అయితే సినీ సెలబ్రెటీలకు రోజుకు రూ.5 లక్షలు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. తాజాగా తెలుగు బిగ్ బాస్ 2 లో ఒక్కో కంటెస్టంట్ కి రూ.20 ల వరకు ఇస్తున్నట్లు సమాచారం. కాకపోతే ఎవరి రెమ్యూనరేషన్ ఎంత అనే విషయాన్ని మాత్రం బయటకు రానివ్వరు. కానీ తెలుగు సింగర్ గీతా మాధురి రెమ్యూనరేషన్ లీక్ అయినట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొనేందుకు గీతామాధురికి పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ అందిందట.

ఆమె హౌస్ లో ఎన్ని రోజులు కొనసాగుతుందనే విషయం పక్కన పెడితే మొత్తగా రూ.20 లక్షల పారితోషికం అందుకుందట. ఆమె హౌస్ లో పది రోజులు ఉన్నా.. షో పూర్తయ్యే వరకు ఉన్నా.. ఆమె రెమ్యునరేషన్ మాత్రం ఫిక్స్ అని టాక్ వినిపిస్తుంది. ఒకవేళ అదృష్టం బాగుండి ఈ అమ్మడు చివరిదాకా ఉంటే..గెలిస్తే.. ఆ డబ్బు వేరే విధంగా ముట్టజెప్పుతారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *