బుల్లితెర హాట్ యాంక‌ర్స్.. రేటు ఎంతో తెలిస్తే షాకే..!

బుల్లితెర యాంక‌ర్ల‌కు వచ్చే పాపులారిటీ.. ఆదాయం వెండితెర భామ‌ల‌ను మించి పోతున్నారు. తెలుగు బుల్లితెర యాంక‌ర్ అన‌గానే.. మొదట మ‌న‌కు గుర్తుకు వచ్చేది సాంప్ర‌దాయ యాంక‌ర్ సుమ. ప్ర‌స్తుతం యాంక‌ర్‌గా ఏ స్థాయిలో ఉందో అందరికి తెలిసిన విషయమే. సుమ టీవీ షోల‌తో పాటు.. సినీ ఈవెంట్ల ద్వారా కూడా బాగా పాపుల‌ర్ అయ్యింది. హైదరాబాద్‌లో జరిగే ఏ ఈవెంట్‌కి అయినా సుమ ఉండాల్సిందే. టాప్ టెన్ హీరోల సినీమా వేడుక‌లు ఏదైనా కావొచ్చు యాంక‌ర్‌గా సుమ ఉండాల్సిందే.. ఇక ఆమె ఒక్కో ఈవెంట్‌కి.. లక్ష నుండి 1.5 లక్షలు వరుకు తీసుకుంటారని సమాచారం. అదే హైదరాబాద్ బయట ఏమైనా ఈవెంట్లు జ‌రిగితే సుమారు.. 2 నుండి 2.5 లక్షలు వరుకు సుమ తీసుకుంటుంద‌ని టాక్. ఇక మ‌రో యాంక‌ర్ ఝాన్సీ యాంక‌రింగ్‌తో పాలు సినిమాల్లో కూడా మెరుస్తోంది.. ఈమె ఎక్కువ‌గా మూవీ ఈవెంట్ల‌లో ద‌ర్శ‌న‌మిస్తోంది. ఈమె ఒక్కో షోకు 75 వేల నుండి ల‌క్ష వ‌ర‌కు తీసుకుంటుంద‌ని టాక్‌.

ఇక సుమ తర్వత రెండో స్థానంలో ఉదయభాను రేసులో ఉన్నారు. ఉదయభాను ఒక్కో ఈవెంట్‌కి తీసుకునే రెమ్మున‌రేష‌న్.. సుమారు 75 వేల నుండి ల‌క్ష వ‌ర‌కు తీసుకునే వార‌ని సమాచారం.. అయితే ప్ర‌స్తుతం ఆమె షోల‌తో పాటు రెమ్యునేష‌న్ రేసులో కూడా వెనుక‌బ‌డిపోయింద‌ని సమాచారం. ఇక ప్ర‌స్తుతం జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్‌గా ఫుల్ ఫామ్‌లో ఉన్న యాంక‌ర్ల‌లో అన‌సూయ ఒక‌రు.. ఈ హాట్ యాంక‌ర్ ఒకవైపు బుల్లితెర మ‌రోవైపు వెండితెర పై రాణిస్తోంది ఈ హాట్ యాంక‌ర్‌..

అన‌సూయ ఒక్కో షోకి 50 నుండి 75వేలు తీసుకుంటుద‌ని స‌మాచారం. ఇక జ‌బ‌ర్ధ‌స్త్ మ‌రో యాంకర్ ర‌ష్మీ గౌత‌మ్.. ఈమె కూడా బుల్లితెర పై వెండితెర పై త‌న అందాల‌ను ఆర‌బోసి ప్రేక్ష‌కుల‌ను త‌న‌వైపు తిప్పుకుంటోంది. ఈ హాట్ యాంకర్ కూడా ఒక్కో షోకి 50 నుండి 75 తీసుకుంటుద‌ని టాక్. ఇక మ‌రొ బుల్లితెర హాట్ యాంకర్‌ శ్రీ ముఖి.. ప‌టాస్ షోతో ఫుల్‌గా పాపుల‌ర్ అయిన శ్రీముఖి.. అప్పుడ‌ప్పుడూ సినిమాల్లో కూడా మెరుస్తోంది. ఈ హాట్ యాంక‌ర్ ఒక్కో షోకి 50 వేలు తీసుకుంటుంద‌ని టాక్ ఇక ఆ త‌ర్వాత యాంకర్ శ్యామల, భార్గ‌వి, మంజుల, శిల్ప చక్రవర్తి వేతనం సుమారు 25000 నుండి 50000 వరుకు తీసుకుంటున్నార‌ని స‌మాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *