వేశ్య పాత్రలో నటించాలనుంది అంటున్న హాట్ యాంకర్

సినిమా ఇండస్ట్రీలో కొంత మందికి లక్ అనేది భలే కలిసి వస్తుంది. గతంలో తెలుగు సినిమాలో చిన్న చిన్న పాత్రల్లో కనిపించిన రష్మి గౌతమ్ ‘జబర్ధస్త్’ కామెడీ షో లో యాంకర్ గా పరిచయం అయిన తర్వాత ఈ అమ్మడి అదృష్టం ఒక్కసారిగా మారిపోయింది. 2002 లో సవ్వడి అనే సినిమాతో ఆమె సినిమా కెరీర్ ప్రారంభమైంది. కానీ ఆ సినిమా విడుదల కాలేదు. తర్వాత ఉదయ్ కిరణ్ కథానాయకుడిగా నటించిన హోలీ సినిమాలో సహాయ పాత్ర పోషించింది. తర్వాత యువ అనే సీరియల్ లో నటించింది.

2010లో తెలుగులో వచ్చిన ప్రస్థానం చిత్రంలో రష్మి సహాయనటిగా చేసింది. ఒక రియాలిటీ డ్యాన్స్ షోలో రష్మి డ్యాన్స్ చూసిన నటి సంగీత కందెన్ సినిమాకి అవకాశం ఇప్పించింది. అలా కందెన్ చిత్రంలో నర్మద అనే ప్రధాన పాత్రను రష్మి పోషించింది. 2011లో తమిళ వచ్చిన కందెన్ అనే శృంగార చిత్రంలో నటించి, తన నటనకు మంచి మార్కులు కొట్టేసింది. తెలుగులో కొన్ని చిన్న సినిమాల్లో నటించినా పెద్దగా గుర్తింపు రాని రష్మికి ‘జబర్ధస్త్’ కామెడీ షోత హాట్ యాంకర్ గా మంచి గుర్తింపు వచ్చింది. దాంతో అతి తక్కువ కాలంలో బాగా పాపులర్ కావడంతో వెండి తెరపై కూడా హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది.

వరుసగా నాలుగైదు సినిమాలో హీరోయిన్ గా నటించిన అవి పెద్దగా సక్సె కాలేదు. ఇక గుంటూర్ టాకీస్ లో రష్మి రెచ్చిపోయి నటించడంతో కాస్త విమర్శల పాలు కూడా అయ్యింది. సాధారణంగా మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవాలంటే..నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించాలి. తమ ప్రతిభను చూపించాలంటే… వేశ్య పాత్రను పోషించడమే మార్గం అన్నట్టుగా అనేక మంది నటీమణులు ఇది వరకూ ఆ తరహా పాత్రలు చేస్తూ వచ్చారు.బాలీవుడ్‌లో అయితే ఒక దశలో అనేక మంది స్టార్ హీరోయిన్లు వేశ్య పాత్రలు చేయడానికి పోటీ పడ్డారు.టబు, రాణిముఖర్జీ, కరీనా కపూర్…ఇలాంటి స్టార్ హీరోయిన్లు వేశ్య పాత్రల్లో నటించి మెప్పించారు. తెలుగులో సెక్స్ ‌వర్కర్ పాత్ర చేసిన పలువురు నటీమణులున్నారు. అనుష్కా, శ్రియా, చార్మి…లు గత కొన్నేళ్లలో వివిధ సినిమాల్లో వేశ్య పాత్రల్లో నటించారు.

వీరి లాగే తాను కూడా సెక్స్ వర్కర్‌గా కనిపించాలని అనుకుంటున్నట్టుగా రష్మీ చెబుతోంది. అలాంటి అవకాశం వస్తే అస్సలు వదులుకోను అని ఈమె అంటోంది. మొత్తానికి గ్లామర్ కి ప్రాధాన్యత ఇవ్వకుండా నటనకు ప్రాధాన్యత ఇస్తాననడం నిజంగా ప్రశంసనీయమే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *