సాయి ధరమ్ తేజ్ సెంటిమెంట్ కు దెబ్బకొట్టిన కళ్యాణ్ దేవ్ !

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ఆలోచనలకు అనుకోని విధంగా చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ చెక్ పెట్టబోతున్నాడా అన్న వార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హడావిడి చేస్తున్నాయి. సాయి ధరమ్ తేజ్ కెరియర్ కు ఎంతో కీలకంగా మారిన ‘తేజ్ ఐ లవ్యూ’ మూవీని జూలై మొదటి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు ప్రారంభించారు.

 

జూలై నెలలో విడుదలైన మెగా హీరోల సినిమాలు అన్నీ ఘన విజయం సాధించిన నేపధ్యంలో ఈనెల సెంటిమెంట్ పై ఎంతో నమ్మకం పెట్టుకున్నాడు తేజ్. అయితే ఇప్పుడు అదేనెల సెంటిమెంట్ పై చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ కన్ను పడినట్లు వార్తలు వస్తున్నాయి. కళ్యాణ్ హీరోగా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న ‘విజేత’ సినిమాకు సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.

 

అతడి వారాహి చలనచిత్ర బ్యానర్ పై విడుదలైన రాజమౌళి ‘ఈగ’ 2012’ జూలై 6న విడుదలైంది. ఇప్పుడు అదే సెంటిమెంట్ ను రిపీట్ చేస్తూ ‘ఈగ’ విడుదలైన జూలై 6న కళ్యాణ్ దేవ్ విజేతను కూడ విడుదలచేసి సూపర్ హిట్ కొట్టాలని నిర్మాత సాయి కొర్రపాటి ప్రయత్నిస్తున్నాడు. దీనితో ఈ నిర్మాత ‘ఈగ’ రిలేజ్ డేట్ ను ‘విజేత’ కు లాక్ చేసినట్లు టాక్

.
ఈపరిస్తుతులలో సాయి ధరమ్ తేజ్ తన ‘తేజ్ ఐ లవ్యూ’ ను జూన్ నెలాఖరుకు కానీ లేదంటే జూలై వేలాఖరుకు కానీ మార్చుకోవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి అని అంటున్నారు. దీనితో జూలై నెల ఈ ఇద్దరి మెగా హీరోలలో ఎవరికీ కలిసి వస్తుంది అన్న విషయం పై ఆసక్తికర కామెంట్స్ వినిపిస్తున్నాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *