ఈ వ‌య‌సులో అవేం ప‌నులు క‌ళ్యాణ్ రామ్?

నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ ఇప్ప‌టివ‌ర‌కూ ప‌క్కా క‌మ‌ర్శియ‌ల్ సినిమాలే చేసాడు. హుందాగా ఉండే హీరోయిక్ లుక్ లో మెప్పించాడు. కుటుంబ క‌థా చిత్ర‌ల్లోనూ త‌న మార్క్ చాటాడు. `ఓమ్` అనే క‌మ‌ర్శియ‌ల్ సినిమాన్నే త్రీడీ లో తెర‌కెక్కించి టెక్నాల‌జీని ప‌రిచ‌యం చేసిన ఘ‌న‌త క‌ళ్యాణ్ రామ్ కే ద‌క్కుతుంది. తెర‌పై అన్న‌య్య గా…త‌మ్ముడిగా …జ‌ర్న‌లిస్ట్ గాను క‌నిపించాడు. ఇప్పుడా ఆ పంథాకు దూరంగా ఉంటూ తొలిసారి తెర‌పై అజ‌రామ‌ర ప్రేమికుడిగా మెప్పించ‌డానికి రెడీ అవుతున్నాడు.

హ‌ద్దులు దాటారా?

ప్రస్తుతం ఆయ‌న `నా నువ్వే` అనే చిత్రంలో న‌టిస్తున్నాడు. జయేంద్ర ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. త‌మ‌న్నా క‌థానాయిక‌గా నటిస్తుండ‌గా, పి.సి. శ్రీరామ్ ఛాయాగ్ర‌హ‌ణం అందిస్తున్నారు. అయితే ఇది ప‌క్కా రొమాంటిక్ ఫిల్మ్ అని ఇటీవ‌ల విడుద‌లైన పోస్ట‌ర్ల‌ను చూస్తే తెలుస్తోంది. తాజాగా విడుద‌లైన త‌మ‌న్నా-క‌ళ్యాణ్ రామ్ పోస్ట‌ర్లు చూస్తే మ‌రీ హ‌ద్దులు దాటి న‌టించిన‌ట్లు క‌నిపిస్తోంది. క‌ళ్యాణ్ రామ్ ఇన్నేళ్ల సినీ కెరీర్ లో ఇప్ప‌టివ‌ర‌కూ అలా ఎప్పుడూ న‌టించ‌లేదు. ద‌బోయ్ నెక్స్ట్ డోర్ అన్న‌ట్లే ఉండేవాడు. కానీ `నా నువ్వే` లో కొత్త క‌ళ్యాణ్ రామ్ ను చూసేలా ఉన్నాం.

ఇదేం మార్పు!

అయితే ఈ పోస్ట‌ర్లు, క‌ళ్యాణ్ రామ్ క్యారెక్ట‌రైజేష‌న్స్ పై అసంతృప్తి వ్య‌క్త‌మ‌వుతోంది. ఎప్పుడూ హీరోయిజం చూపించే క‌ళ్యాణ్ ఇంత రొమాంటిక్ గా మారిపోయాడేంటి? అసలు ఆయ‌న వ‌య‌సుకు..ఇమేజ్ కు ఇలాంటి పాత్ర‌లు ఎలా సెట్టవుతాయి? వ‌య‌సుతో సంబంధం లేకుండా క‌ళ్యాణ్ రామ్ పాత్ర‌లో ఎలా? న‌టిస్తున్నాడంటూ విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. మ‌రి ఈ విమ‌ర్శ‌ల‌కు క‌ళ్యాణ్ ఎలాంటి బ‌ధులిస్తాడో చూద్దాం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *