డిసప్పాయింట్ అయ్యా.. ఆ ఘాటు ఏది? బిగ్ బాస్ 2పై కత్తి కార్తిక

బిగ్ బాస్ 2 రెండో సీజన్ నాని హోస్ట్‌గా ఇటీవల గ్రాండ్‌గా ప్రారంభమైంది. మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ పాల్గొంటున్న ఈ షో 106 రోజుల పాటు సాగనుంది. బిగ్ బాస్ రెండో సీజన్ సాగుతున్న తీరుపై మొదటి సీజన్ కంటెస్టెంట్ కత్తి కార్తిక స్పందించారు. రెండో సీజన్లో కంటెస్టెంట్స్ ఎంపికపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బిగ్ బాస్ 2లో ఇంకొంచెం మసాలా అని చెబుతున్నారు… కానీ అందులో కడక్‌నెస్, ఘాటు మిస్సయిందని కార్తీక అన్నారు. అది మిస్ కావడానికి కారణం రెండో సీజన్లో తెలంగాణ ప్రాంతం వారు ఎవరూ లేక పోవడమే అని కార్తీక తెలిపారు.

మొదటి సీజన్ మాదిరిగానే రెండో సీజన్లో కూడా ఆ ఫ్లేవర్ తగిలి ఉంటే బావుండేదని కత్తి కార్తీక అభిప్రాయ పడ్డారు. ఈ సీజన్లో తెలంగాణ జానపదం లేదా ఆ కల్చర్ కనిపించి ఉంటే ఏక్ దమ్ ఘాటు తగిలేదన్నారు. ఒక్కరైనా తెలంగాణ వారిని పెట్టి ఉంటే ఈ షో మరింత బావుండేదన్నారు. తొలి సీజన్లో ఒక తెలంగాణ పాట(మధు ప్రియ) ఒక తెలంగాణ భాష (కార్తిక), ఒక తెలంగాణ యాక్టర్ (సంపూ) ఉన్నారు. బిగ్ బాస్ మొదటి సీజన్లో ముగ్గురు తెలంగాణ వారిని పెట్టడం వల్ల అన్ని ప్రాంతాల వారు బిగ్ బాస్ ఇంట్లో ఉండటం వల్ల రకరకాల వేరియేషన్స్ కనిపించాయి. సీజన్ 2లో అది మిస్సయింది. ఈ విషయంలో నేను డిసప్పాయింట్ అయ్యాను అని కత్తి కార్తీక తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *