హాట్ టాపిక్: కీర్తి సురేష్‌కే పెద్ద షాక్ ఇస్తున్న కీర్తి సురేష్‌ అమ్మమ్మ

‘మహానటి’ మూవీతో దక్షిణాది సినిమా రంగంలో టాప్ హీరోయిన్ స్థాయికి చేరువలో ఉన్న కీర్తి సురేశ్ వార్తలతో ఇప్పుడు మీడియా హోరేత్తిపోతోంది. దీనికితోడు ఆమెతో నటించడానికి దక్షణాది సినిమా రంగానికి చెందిన అనేకమంది టాప్ హీరోలు ఆసక్తి కనపరుస్తున్నా వచ్చిన అవకాశాలు అన్నీ ఒప్పుకోకుండా తనకు నచ్చిన సినిమాలను మాత్రమే ఎంచుకుంటోంది కీర్తి.
అయితే ప్రస్తుతం కీర్తితో పాటు సమానంగా ఆమె అమ్మమ్మ సరోజ వార్తలు కూడ మీడియాకు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. కీర్తి తల్లి మేనక మలయాళంలో ఒకప్పుడు పాపులర్‌ హీరోయిన్‌ అన్న విషయం తెలిసిందే. ఆమె తెలుగులో కూడ కొన్ని సినిమాలలో నటించింది. కీర్తి హీరోయిన్ అయిన తరువాత ఆమెకు తోడుగా తల్లి మేనకతో పాటు అప్పుడప్పుడు కీర్తి అమ్మమ్మ సరోజ కూడ షూటింగ్ కు రావడం ఆమె అలవాటు.

గతంలో ‘రెమో’ షూటింగ్‌ సమయంలో కీర్తి బామ్మ సరోజను చూసిన దర్శకుడు శివకార్తికేయన్‌ ఆమెను ఒక్క సీనులో నటింపజేశాడు. ఆ తరువాత ఆమెకు కూడా సినిమాల్లో నటించాలన్న ఆశ కలిగింది. ఈ నేపథ్యంలో చారుహాసన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ‘దాదా 87’ లో సరోజ కీలకపాత్రకు ఎంపిక చేశారు 87 ఏళ్ల వయసున్న దాదా పాత్ర పోషిస్తున్న చారుహాసన్‌ కు భార్యగా నటింపజేసేందుకు 80 ఏళ్ల వయసున్న బామ్మలను అన్వేషిస్తుండగా కీర్తిసురేష్‌ బామ్మ గురించి తెలిసింది. ఆమెకు కూడా నటనపై ఆసక్తి ఉండడంతో ఆ పాత్రలో ఈసినిమాలో నటింపజేశారు.

ఆపాత్రను ఆమె అద్భుతంగా పోషించింది అని వార్తలు రావడంతో తమిళ దర్శకుడు పాండిరాజ్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ‘కడైకుట్టి సింగం’ చిత్రంలో హీరో కార్తికి బామ్మగా సరోజ స్తోంది. ఈసినిమా మాత్రమే కాకుండా ప్రస్తుతం ఆమెకు మరిన్ని అవకాశాలు కోలీవుడ్ ఇండస్ట్రీలో వస్తున్నట్లు టాక్. సుమారు ఎనిమిది పదుల ప్రాయంలో సినిమాల్లో అడుగుపెట్టిన ఈ సరోజ వరుస ఆఫర్లతో అందర్నీ ఆశ్చర్యపరుస్తూ కీర్తి సురేశ్ కే షాక్ ఇస్తోంది.. అయితే ఈవయస్సులో తాను నటిస్తున్న ఈపాత్రలు వల్ల వస్తున్న పారితోషికాన్ని ఈ అమ్మమ్మ చేస్తున్న పని హైలెట్ గా మారింది ఒల్దేజ్ హోమ్ కు విరాళంగా ఇస్తున్నట్లు సమాచారం..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *