టాలీవుడ్ హీరోల గురించి.. సంచ‌ల‌న విష‌యాలు చెప్పిన కుష్బూ..!

తెలుగు, తమిళం, మలయాళం మాత్రమే కాకుండా హిందీ భాషల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న నటి కుష్బూ. హీరోయిన్ గా అనేక విజయాలు అందుకున్న ఈమె క్యారక్టర్ ఆర్టిస్టుగానూ అభినందనలు అందుకుంటున్నారు. స్టాలిన్ సినిమాలో చిరంజీవికి అక్కగా నటించిన కుష్బూ.. తాజాగా అజ్ఞాతవాసి చిత్రం లోనూ పవన్ కళ్యాణ్‌కి పిన్నిగా నటించి మెప్పించారు. వెండితెర, బుల్లితెరపై పలు కార్యక్రమాలతో బిజీగా ఉన్న ఈమె సోషల్ మీడియా వేదికపై అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్పారు. తెలుగు హీరోల గురించి మీ అభిప్రాయం ఏంటి అని అడగగా.. ఆమె స్పందించారు.

చిరంజీవి లెజెండ్, బంగారం లాంటి మనసున్న వ్యక్తి. విక్టరీ వెంకటేశ్ మై సెంటిమెంటల్‌ హీరో. పవన్ కల్యాణ్ మంచి సహ నటుడు. ఆయనతో పని చేయడం చాలా సౌకర్యం. మహేశ్‌తో పని చేయలేదని… అతని గురించి పెద్ద‌గా తెలియదని… కానీ అత‌నో మంచి మనిషని చెప్పింది. ఇక‌ తారక్ అంటే ఇష్టమ‌ని మనసులోని మాటని బయటపెట్టారు కుష్బూ. ఇక త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించారు.. కదా.. అతని గురించి చెప్పమని కోరగా.. వీలుంటే అతని దర్శకత్వంలో మరో మూవీ చేయాలనీ ఉందని వెల్లడించారు. అలాగే తమిళ హీరోల గురించి మాట్లాడుతూ రజనీకాంత్ వన్ అండ్ ఓన్లీ సూపర్ స్టార్. టాలెంటెడ్ స్టార్. కమళ్ హాసన్ మంచి స్నేహితుడని… అతనికి నేను అభిమానని ఖుష్బూ వివరించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *