నన్ను కూడా పడుకోమన్నాడు ..! లాస్య షాకింగ్ కామెంట్స్

ఎన్నో ఆశలతో..హీరోయిన్ గా వెలిగిపోవాలని..ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న కొంతమంది తారల పరిస్థితి తారుమారువుతోంది. తెరపై తళుక్కుమని వెలిగే జీవితాల వెనుక..ఓ వికృత క్రీడ దాగివుంది. అవకాశాల కోసం ఎదురుచూసే హీరోయిన్లకు..డబ్బు ఆశ చూపించి గాలం వేస్తున్నారు కొంతమంది దుర్మార్గులు. ఇండియాలో కాదు..ఏకంగా అమెరికాలోనే హైటెక్ వ్యభిచారం నడిపిస్తున్నారు.

అయితే ఈవెంట్స్ కోసం అమెరికాకు వెళ్లే మన హీరోయిన్స్ మాత్రమే కాదు యాంకరింగ్ కోసం వెళ్లే టాప్ యాంకర్స్ కూడా వ్యభిచారం రొంపిలో ఇరుకున్నారని లాస్య సంచలన ఆరోపణలు చేసింది .., లాస్య మాట్లాడుతూ తనకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైందని లాస్య తెలిపింది. న్యూజెర్సీలో స్థిరపడిన ఓ వ్యక్తి చాలా ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు. ఆయన నాకు ఫోన్ చేసే ఆ ఉద్దేశంతో అడిగాడు. నేను కుదరదని చెప్పేశానని లాస్య తెలిపింది. నాతో పెద్ద పెద్ద యాంకర్సే పడుకున్నారు.. నువ్వెంత ఆఫ్ట్రాల్ అని తనతో మాట్లాడడని, పట్టరాని కోపం వచ్చిందని లాస్య తెలిపింది. ఈవెంట్ కోసం వచ్చిన హీరోయిన్లు అక్కడ కాసేపు మాత్రమే ఉంటారు. ఆ తరువాత హోటల్ రూమ్స్ కి వెళ్ళిపోతారు. అప్పటి నుంచి వాళ్ళని చాలా మంది సీక్రెట్ గా కలుస్తుంటారని లాస్య తెలిపింది. యూస్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో దిమ్మతిరిగే విషయాలు బయిటపడ్డాయి..

కల్చరల్ ఈవెంట్స్ కోసం అమెరికా వెళ్లే గ్రూప్ మెంబర్స్ తో పాటుగా.. అమెరికాలో కాన్ఫెరెన్స్ లు నిర్వహించే వ్యాపారవేత్తలకు..హీరోయిన్స్ ని ఎరగా వేసి భారీగా డబ్బులు పోగేసుకుంటున్నారు..సెక్స్ రాకెట్ లో ప్రధాన నిందితులుగా ఉన్న కిషన్, చంద్ర దంపతులు. ఇలా ఒక్కొక్కరి దెగ్గర..మూడు వేల డాలర్లు వసూల్ చేస్తున్నారట. టాలివుడ్ హీరోయిన్స్ తో అమెరికాలో వ్యభిచారం జరుగుతోందని బయిటపడటంతో..ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తం షాక్ కి గురవుతోంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *