మహానటిలో పెద్ద మైనస్.. ఆ పాత్రను తొలగించి ఘోరమైన తప్పు చేశారు!!

మహానటి.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనే అద్భుతమైన దృశ్యకావ్యం.. సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ మూవీలో ఎంతో మంది దిగ్గజ హీరోలు, హీరోయిన్లు, సీనీ ప్రముఖులు, దర్శకులు నటించారు. ఇందులో ఒక్క పాత్ర అయినా చేస్తే బాగుండు అని అందరూ ఆశపడ్డారు. కానీ మహానటిలో నటించి కూడా ఓ హీరోయిన్ పాత్ర సినిమాలో లేకపోవడంతో ఆమె నిరాశచెందింది. దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నిడివి చాలా పెద్దది. దీంతో అన్ని పాత్రలను తెరపై చూపించడం వీలుకాకపోగా.. చివరి నిమిషంలో సినిమాలో చిత్రించిన కొన్ని కీలక పాత్రల సన్నివేశాలను సైతం తొలగించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జెమినీ గణేషన్ రెండో భార్య అయిన పుష్పవల్లి పాత్రను సినిమానుంచి తొలగించారట.

ఈ నేపథ్యంలో ఆ పాత్ర పోషించిన నటి బిందు చంద్రమౌళి సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు. ‘మహానటి’ చిత్ర బృందంతో కలిసి పనిచేయడం ఓ చక్కటి అనుభూతిని ఇచ్చిందని.. తన పాత్రను సినిమా నుంచి తొలగించడం కొంచెం బాధ కలిగిందని ఆవేదన వ్యక్తం చేసిందట.. ఈ విషయం కాస్త సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

దీంతో నాలిక కరుచుకున్న నటి బిందు వివరణ ఇచ్చింది. కేవలం తన పాత్రలేదనే బాధను తన వ్యక్తిగత అకౌంట్లో పోస్ట్ పెట్టానని.. అంతే తప్ప సినిమా యూనిట్ పై తాను ఎటువంటి వ్యతిరేక వ్యాక్యలు చేయలేదని ఆమె స్పష్టం చేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *