మహానటిలో కీర్తి సురేష్ కన్నీళ్లు పెట్టుకున్న సీన్ ఏదో తెలుసా?!!

తెలుగు సినీ చరిత్రలో ఎప్పటికీ చిరస్మరణీయంగా మిగిలిపోయే ఓ అద్భుత కళాఖండం మహానటి. ఇందులో ఎంతో మంది నటులు, దర్శకులు పాలుపంచుకున్నారు. ప్రతీ పాత్రను అద్భుతంగా చెక్కి సినిమాకు ప్రాణం పోశారు. సావిత్రిగా కీర్తి సురేష్, జెమినీ గణేషన్ గా దుల్కర్, ఏఏన్నార్ గా నాగచైతన్య, ఎస్వీఆర్ గా మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ లు జీవించేశారు. ఇంత మంది ఇన్ని పాత్రలు చేసిన మూవీ మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. అయితే అందరికంటే ఎక్కువ మార్కులు పడింది సావిత్రి పాత్ర చేసిన కీర్తి సురేష్ కే.. ఆ పాత్రలో ఆమె చూపిన అభినయం అందరి మదిని దోచేసింది.

ఈ సందర్భంగా చిత్రంలోని షూటింగ్ టైంలో తనకున్న అనుభవాలను తాజాగా కీర్తి సురేష్ పంచుకుంది. కీర్తి సురేష్ మాట్లాడుతూ.. తనకు సినిమా మొత్తం ఒక అనుభవం అయితే.. సావిత్రి బిడ్డకు జన్మనిచ్చే దృశ్యాన్ని చిత్రీకరిస్తున్న రోజు జరిగిన ఘటన మాత్రం మరిచిపోలేనిది.

సావిత్రి కుమార్తె విజయ వచ్చి తన తల్లి తనకి జన్మనిచ్చే దృశ్యం చూసుకొని ఉద్విగ్నతకి గురై నన్ను ‘నా చిన్ని తల్లి’ అని పిలవడం ఒక మరిచిపోలేని అనుభూతి.. అంటూ కీర్తి ఎమోషనల్ అయ్యింది. ఒక బిడ్డకు ఆనందాన్ని అందించడం కన్నా సంతోషం ఇంకేముంటుంది అని మురిసిపోయింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *