ఛీ..ఛీ ఇలాంటి కన్నా తల్లి కూడా ఉంటుందా..?

గతనెల ఏప్రిల్ 18వ తేదిన కేరళ రాష్ట్రంలోని ఏడప్పల్ లో ఉన్న సినిమా థియేటర్లో ఒక మైనర్ బాలికపై ఆమె తల్లి పక్కనుండగానే ఒక వ్యక్తి అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన కలకలం రేపిన విషయం తెలిసిందే. కేరళ రాష్ట్రంలో ఈ కేసు సంచలనం సృష్టించింది. అందుకు తగట్టుగా స్పందించిన అక్కడి పోలీసులు అతడిని గుర్తించి అరెస్ట్ కూడా చేశారు.

అయితే ఈ కేసును విచారిస్తున్న పోలీసులకు నమ్మలేని నిజాలు తెలియడంతో వారు సైతం విస్తుపోయారు. ఈ కేసుకు సంబందించి భాదిత మైనర్ బాలికను పోలీసులకు విచారిస్తుండడంతో ఆమె వారికి కొన్ని నిజాలను తెలిపింది. కేవలం తన తల్లివల్లనే అతను తనతో అలా ప్రవర్తించాడని తెలిపింది. తన తల్లి ప్రోత్సాహంతోనే అతడు అలా ప్రవర్తించాడని విచారణలో తెలిపింది.

అతను అప్పుడప్పుడు తమ ఇంటికి వచ్చేవాడని బాధితురాలు పోలీసులకు చెప్పింది. గతంలో కూడ తనపై అతను తప్పుడుగా వ్యవహరించినట్లు, ఇదే విషయాన్ని తాను తల్లితో చెబితే ఆమె దూషించినట్లుగా బాధితురాలు విన్నవించుకుంది. అంతేగాక వారికి బట్టలు, భోజనం పెట్టించేవాడని బాధితురాలు చెప్పింది. దీనితో పోలీసులు ఆమె తల్లిని కూడా అరెస్ట్ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *