బిగ్ బాస్-2 నాని అసంతృప్తికి కారణం..!

స్టార్ మా నిర్వహిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ రెండవ సీజన్ కు నాని హోస్ట్ గా చేస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ మొదటి సీజన్ హోస్ట్ గా చేశాడు. బుల్లితెర ఆడియెన్స్ ను తారక్ అలరించిన తీరు అందరిని ఆశ్చర్యపరచింది. స్టార్ ఇమేజ్ ఏమాత్రం అడ్డు రాకుండా కంటెస్టంట్స్ అందరిని ప్రేమగా పిలిచి మెప్పించాడు ఎన్.టి.ఆర్.

 

ఇక ఇప్పుడు నాని వంతు వచ్చింది. నాని తన వంతుగా కృషి చేస్తున్నా ఎక్కడో తేడా కొడుతుంది. నాని వచ్చింది కేవలం ఒక ఎపిసోడ్ మాత్రమే కాబట్టి అసలు విషయం ముందు ఉంటుంది. అయితే నానికి బిగ్ బాస్ కన్నా బయట శ్రీరెడ్డి తలనొప్పి ఎక్కువైంది. ఆమె తరచు నానిని టార్గెట్ చేస్తూ అతన్ని ఇబ్బంది పెడుతుంది.

 

కెరియర్ లో స్మాల్ స్క్రీన్ పై ఓ క్రేజీ అటెంప్ట్ చేస్తున్న నాని మొదటి ఎపిసోడ్ లో అంత గురి పెట్టలేకపోయాడు. శ్రీరెడ్డి ఇష్యూ తనని ఏమి చేయలేకున్నా అనవసరంగా తన ఇమేజ్ డ్యామేజ్ అయ్యేలా ఆమె కామెంట్స్ ఉండటం నానిని ఆలోచనలో పడేస్తున్నాయి. అందుకే లీగల్ గా కూడా నాని ప్రొసీడ్ అవుతున్నాడని ఎనౌన్స్ చేశారు.

 

ఈ వ్యవహారం ముదిరితే మాత్రం నాని బిగ్ బాస్-2 హోస్ట్ నుండి కూడా బయటకు వచ్చే అవకాశం ఉందని ఇన్నర్ టాక్. శ్రీరెడ్డిని బిగ్ బాస్ కంటెస్టంట్ గా తీసుకోకుండా నాని అడ్డుపడ్డాడన్న కామెంట్స్ కూడా అతనికి హెడ్డేక్ గా మారాయి. మరి నాని బిగ్ బాస్ ఎలా కంటిన్యూ చేస్తాడన్నది చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *