‘నేల టిక్కెట్టు’ ట్రైలర్

‘నేల టిక్కెట్టు’ ట్రైలర్రవితేజ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం ‘నేల టిక్కెట్టు’. మాళవిక శర్మ నాయికగా నటిస్తోంది. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రామ్‌ తాళ్లూరి నిర్మిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకుడు. మే 24న విడుదల కానున్న ఈ చిత్ర పాటలు ఇటీవల పవర్ స్టార్ పవన్ కల్యాణ్ చేతుల మీదుగా విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

ఇక ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాలో కామెడీకి పెద్ద పీట వేసినట్లుగా తెలుస్తుంది. ముఖ్యంగా రవితేజ ఈ ట్రైలర్‌లో సరికొత్త ఎనర్జీతో కనిపిస్తున్నాడు. ఇక విలన్‌గా జగపతిబాబు మరోసారి రెచ్చిపోయినట్లుగా తెలుస్తుంది. ఓవరాల్‌గా ఈ ట్రైలర్ మాత్రం సినిమాపై అంచనాలను పెంచే విధంగానే ఉంది. రవితేజకే సాధ్యమైన కొన్ని డైలాగ్స్‌ని దర్శకుడు కళ్యాణ్ కృష్ణ ఈ చిత్రంలో చెప్పించాడు. ట్రైలర్ చివరిలో ‘నేలటిక్కెట్టు గాళ్లతో పెట్టుకుంటే నేల నాకించేస్తారు’ అనే ఒక్క డైలాగ్.. ఈ సినిమా ఏ విధంగా ఉండబోతుందో చెప్పేస్తుంది. మొత్తానికి రవితేజ సినిమాకి ఏమేం కావాలో అవన్నీ ఈ సినిమాలో కళ్యాణ్ కృష్ణ పొందుపరచినట్లుగా ఈ ట్రైలర్ చూపించేసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *