బిగ్ బ్రేకింగ్ న్యూస్ : తెలుగు హీరోయిన్లని వ్యభిచారంలోకి దించుతున్న ఆ జంట అరెస్ట్..!

సినిమా తారలకు యూఎస్ లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. ఆటా, నాటా సభల కోసం ఇక్కడ స్టార్స్ ను అక్కడకు తీసుకెళ్లి మరి ప్రోగ్రాం సక్సెస్ చేసుకుంటారు. ఇక్కడ నుండి స్టార్స్ మొదలైంది మొదలు మళ్లీ వచ్చే దాకా ఖర్చులన్ని వారివే. ఇదంతా పైకి కనిపించేది లోపల వేరే సినిమా అని తెలుస్తుంది.

అక్కడకు వచ్చిన వారిని హెరాస్ చేస్తూ వారి ఆగ్రహానికి గురవుతున్నారు కొందరు. ముఖ్యంగా శ్రీరాజ్ చెన్నుపాటి అలియాస్ కిషన్ మోడుగుముడి యూఎస్ వచ్చే యాంకర్స్, చిన్న ఆర్టిస్టులను ఇబ్బంది పెడుతున్నాడట. వారిని హెరాస్ చేస్తున్నట్టు ఇదవరకు వార్తలు వచ్చాయి. కాని ఇప్పుడు ఏకంగా వారి బండారం బయట పడటంతో అతన్ని చికాగో పోలీసులు అరెస్ట్ చేశారు.

కిషన్ మోడుగుముడి అతని భార్య చంద్ర మోడుగుముడి యూఎస్ వచ్చే కొందరు సెలబ్రిటీస్ ను సెక్సువల్ గా హెరాస్ చేస్తుండటం జరుగుతుందట. వారికి అక్కడ ఒక్క రాత్రికి ఇంత ఎమౌంట్ అని ఆఫర్ చేస్తారట. కొందరు వారిచ్చిన ఆఫర్ కు కన్విన్స్ అవగా కొందరు మాత్రం ఇలాంటివాటికి నో అని చెప్పారట. ఎస్ అంటే పర్వాలేదు నో అంటేనే వారు అక్కడ వీరు ఉన్న ఆ వారం రోజులు చుక్కలు చూపిస్తారట. ఎలాంటి సౌకర్యాలను ఇవ్వకుండా చాలా ఇబ్బంది పెడతారట. ఫైనల్ గా వారి వ్యవహారం బయటపడటంతో పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే కిషన్, చంద్రల వల్ల ఏయే సెలబ్రిటీస్ ఇబ్బంది పడ్డారు అన్నది మాత్రం ఇంకా తెలియలేదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *