ఒకే రోజు ఎన్టీఆర్, చరణ్‌ ఇంట పండగ వాతావరణం

టాలీవుడ్‌కి చెందిన ఇద్దరు స్టార్ హీరోల ఇంట ఒకే రోజు పండగ వాతావరణం నెలకొంది. ముందుగా మెగా హీరో, మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, ఉపాసనల పెళ్లిరోజు ఈరోజు (జూన్ 14). దీనిని పురస్కరించుకుని మెగా ఫ్యామిలీ సెలబ్రేట్ చేసుకుంటుంటే మరో వైపు ఇదే రోజు(జూన్ 14) యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరోసారి తండ్రయిన ఆనందంలో ఉన్నారు. ‘నా కుటుంబం మ‌రింత పెద్ద‌దైంది. బాబు పుట్టాడు’ అంటూ ఎన్టీయార్ ట్వీట్ చేశారు. దీంతో మెగా, నందమూరి అభిమానులకు ఒకే రోజు అమితానందం కలిగించిన రోజుగా జూన్ 14 నిలిచిపోనుంది.

చరణ్, ఉపాసనల పెళ్లిరోజుకు సంబంధించిన విషయాలను ఉపాసన తన ట్విట్టర్‌లో షేర్ చేసింది. పెళ్లిరోజు శుభాకాంక్షలు తెలిపిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అంటూ ఉపాసన పోస్ట్ చేసింది. ఇది మెగాభిమానులకు ఆనందం కలిగించే విషయమైతే.., నందమూరి వారసుడి రూపంలో నందమూరి అభిమానులు కూడా ఆనందంలో విహరిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే ఈ ఇద్దరూ కలిసి రాజమౌళి దర్శకత్వంలో త్వరలోనే ఓ సినిమా చేయబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *