రవితేజాకు పైసా ఉపయోగపడని పవన్ సహాయం !

ఈ సంవత్సరం టాప్ హీరోల సమ్మర్ రేస్ చివరికి చేరుకుంది. ఈ టాప్ హీరోల రేస్ లో చివరి సినిమాగా రాబోతున్న రవితేజ ‘నేలటిక్కెట్టు’ ఈ నెల 25న విడుదల కాబోతోంది. దీనితో ఈసమ్మర్ రేస్ కు మాస్ మహారాజ ఎటువంటి ఫినిషింగ్ టచ్ ఇవ్వబోతున్నాడు అన్న విషయమై అంచనాలు పెరుగుతున్నాయి.

కళ్యాణ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈమూవీలో రవితేజ మార్క్ ఎంటర్ టైన్ మెంట్ ఉంటుంది అని అంటున్నారు. అయితే ఈమూవీకి నిర్మాతలు ఖర్చు పెట్టిన ఖర్చు రవితేజ మూవీల మార్కెట్ కు మించి ఉండటంతో ఈసినిమాకు ఈమూవీ నిర్మాతలు కోరుకున్న రేట్లు బయ్యర్ల నుండి రావడం లేదు అని వార్తలు వస్తున్నాయి.

దీనికితోడు రవితేజ నటించిన లేటెస్ట్ మూవీ ‘టచ్ చేసి చూడు’ ఘోరమైన ఫ్లాప్ గా మారడంతో మాస్ మహారాజ మార్కెట్ పై నమ్మకం లేక చాలామంది బయ్యర్లు ‘నేలటిక్కెట్టు’ పై ఆసక్తి కనపరచడం లేదు అని అంటున్నారు. అయితే ఈమూవీ ఆడియో ఫంక్షన్ కు పవన్ కళ్యాణ్ అతిధిగా వచ్చిన తరువాత ఈమూవీ గురించి బయ్యర్లలో ఆసక్తి పెరుగుతుంది అని ఈమూవీ నిర్మాతలు భావించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *