షాక్: ప్రముఖ నటుడు ఇంట్లో విషాదం..

బుల్లితెర, వెండితెర ఇలా తెర ఎలాంటిదయినా కెమెరా ఆన్ చేయగానే ఇచ్చిన పాత్రకు అల్లుకు పోయి దానికి వందశాతం న్యాయం చేసే నటులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వారి కోవకు చెందుతాడు నటుడు రాజా రవీంద్ర. పెదరాయుడు లాంటి సూపర్ హిట్ సినిమాలో తన నటన ద్వారా విమర్శకుల ప్రశంసలను సైతం అందుకున్నాడు.

రాజా రవీంద్ర ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నాడు. నటన మాత్రమే కాకుండా ప్రొడక్షన్ రంగంలోనూ కొనసాగుతున్నాడు. ప్రొడక్షన్ రంగంలోకి మొదలు పెట్టిన కొత్తలో పలువురు హీరోల డేట్స్ చూసుకునేవాడు. ప్రస్తుతం రాజ్ తరుణ్ వంటి కొందరు యంగ్ హీరోలకు మేనేజర్ గా కూడా పనిచేస్తున్నాడు. అంతేగాక ఆయనకు హాలీవుడ్ నుండి ఆఫర్ వచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

అయితే ఈయన ఇంట్లో ఈ రోజు ఒక విషాదం జరిగిందన్న సంగతి ఆలస్యంగా బయటికి పొక్కింది. ఈయన తండ్రి గారు అయిన జయప్రకాశ్‌ రాజు ఈ రోజు ఉదయం మరణించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కాగా ఆయన బ్రెయిన్‌ హ్యామరేజ్‌ అనే వ్యాధితో బాధపడుతున్నారని సమాచారం. ఈ ఉదయం ఆరున్నర సమయంలో ఆయన స్వర్గస్తులయినట్లు తెలిసింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *