షాక్: కారు ప్రమాదంలో గాయాలపాలైన ప్రముఖ నటి

ప్రముఖ మరాఠీ సినీ నటి ప్రార్థన బెహెర్ కారు ప్రమాదంలో గాయాలపాలైంది. తన అప్‌కమింగ్ మూవీ ‘మస్కా’ సినిమా ప్రమోషన్స్ కోసం సహనటుడు అనికేత్ విశ్వేశ్వర్‌రావు మరియు తన హెయిర్ స్టైలిస్ట్‌తో కలిసి కారులో ముంబై నుండి కోహ్లాపూర్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ముంబై- పూణే ఎక్స్‌ప్రెస్ హై వే మార్గంలో వెళ్తుండగా కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న టెంపో వాహనాన్ని డీ కొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ సహా కారులో ప్రయాణిస్తున్న ముగ్గురూ గాయపడటంతో వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో నటి ప్రార్థన బెహెర్ కుడి భుజానికి ఫ్యాక్చర్ కాగా మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *