జూనియర్ ఎంపికకు షాక్ అయిన రాజమౌళి !

రాజమౌళి త్వరలో సెట్స్ పైకి తీసుకువెళ్ళబోతున్న జూనియర్ చరణ్ ల మల్టీ స్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ కు ఇంకా ప్రారంభ పూజ కూడ జరగకపోయినా ఈ సినిమాకు సంబంధించిన వార్తలు లేకుండా ఒక్కరోజు కూడ గడవడం లేదు. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీకి సంబంధించి మరో ఆసక్తికర న్యూస్ ఇప్పుడు బయటకు వచ్చింది.

 

ప్రస్తుతం ఫిలిం ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం మొదట ఈ మల్టీ స్టారర్ గురించి స్టోరీ లైన్ అనుకుని రాజమౌళి జూనియర్ ను కలిసి తన మనసులోని స్టోరీ లైన్ ను వివరించిన తరువాత జూనియర్ తో పాటు నటించబోయే మరో హీరో పాత్రకు సంబంధించి ముగ్గురు పేర్లను రాజమౌళి జూనియర్ చెప్పినట్లు టాక్. మొదట్లో ఈమూవీకి సంబంధించి రెండవ హీరో పాత్రకు మహేష్ అల్లు అర్జున్ చరణ్ ల పేర్లు రాజమౌళి మనసులో ఉన్నాయి అని అంటారు.

 

అయితే జూనియర్ ఈ మల్టీ స్టారర్ కు తనతోపాటు చరణ్ కాంబినేషన్ ఉంటేనే బాగుంటుంది అని మరో హీరో పేరు ఒక్క క్షణం కూడ ఆలోచించవద్దు అంటూ జూనియర్ రాజమౌళి పై ఒత్తిడి చేసాడు అన్న గాసిప్పులు ఉన్నాయి. దీనితో మరో ఆలోచన లేకుండా రాజమౌళి చరణ్ ను కలవడం ఈ మల్టీ స్టారర్ కు మరో హీరోగా చరణ్ ఫిక్స్ చేయడం జరిగిపోయింది అని అంటున్నారు.

 

ప్రస్తుతం ఈ వార్తలు ఇలా బయటకు రావడంతో జూనియర్ చరణ్ పై ఉన్న అభిమానంతో ఇలా వ్యవహరించాడా లేదంటే అల్లు అర్జున్ మహేష్ లతో కలిసి నటించడం కంటే చరణ్ తో తాను కలిసి నటిస్తే తన ఇమేజ్ కి ఏమాత్రం డేమేజ్ జరగదు అని చరణ్ వ్యూహాత్మకంగా ఆలోచించాడా అన్న విషయమై రకరకాల భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. వాస్తవానికి అల్లు అర్జున్ రాజమౌళి సినిమాలో నటించాలి అని ఎన్నో ప్రయత్నాలు చేసినా చిట్టచివరకు ఈ అవకాశం చరణ్ కు లభించడం వెనుక జూనియర్ హస్తం ఉంది అని జరుగుతున్న ప్రచారంలో ఎన్ని నిజాలో తెలియకపోయినా చరణ్ జూనియర్ ల మధ్య ఈ సాన్నిహిత్యం దేనికి సంకేతం అంటూ కొన్ని ఆసక్తికర కామెంట్స్ వినిపిస్తున్నాయి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *