చిరంజీవికి షాక్ ఇస్తూ రామ్ చరణ్ సంచలన నిర్ణయం

రంగస్థలం తర్వాత రామ్ చరణ్ మళ్ళీ అదే రేంజ్ లో హిట్ కొట్టటానికి రెడీ అయ్యాడు. ప్రస్తుతం రామ్ చరణ్ బోయపాటి దర్శకత్వంలో నటిస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ రాజమౌళి మల్టీ స్టారర్ సినిమాలో నటించటానికి కమిట్ అయినా సంగతి తెలిసిందే. మెగా పవర్ స్టార్ ఈ రెండు మూడు సంవత్సరాలు వరుస హిట్స్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ప్రస్తుతం రామ్ చరణ్ రంగస్థలం సినిమాతో హిట్ కొట్టి ఆ ఆనందాన్ని ఎంజాయ్ చేస్తూ బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న సినిమా షూటింగ్ లో బిజీగా గడిపేస్తున్నాడు. ఈ సినిమా యాక్షన్ హై వోల్టేజ్ సినిమా అని సమాచారం. స్టార్ హీరోల సినిమాలు మాస్ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో ఉంటే ప్యాన్స్ కి పండగే పండగ.

బోయపాటి,రాంచరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా గురించి ఒక వార్త ఫిల్మ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. గోపాల్ డైరెక్షన్ లో మెగాస్టార్ నటించిన ఇంద్ర సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఆ సినిమా రిఫరెన్స్ తోనే బోయపాటి చరణ్ సినిమా చేస్తున్నాడని సమాచారం.

సినిమా ఫ్యాక్షన్ నేపథ్యంలో ఉంటుందని సమాచారం. ఈ సినిమాను ఇంద్ర సినిమాకి సీక్వెల్ అని అంటున్నారు. ఇంద్ర 2 సినిమాతో రామ్ చరణ్ చిరంజీవికి షాక్ ఇవ్వబోతున్నాడని….ఇద్దరిలో ఎవరి నటన ఏ పాటిదో కొద్దీ రోజుల్లోనే తేలిపోతుందని ఫిలిం నగర్ లో వర్గాలు అంటున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *