దిమ్మ తిరిగేలా రంగస్థలం బిజినెస్.. బ్లాక్‌బస్టర్ కావాలంటే ఎంత వసూలు చేయాలో తెలుసా?

రాంచరణ్, సమంత జంటగా దర్శకుడు సుకుమార్ రూపొందించిన రంగస్థలం చిత్రంపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. సినిమా పెరిగిన అంచనాలకు ధీటుగా ప్రీరిలీజ్ బిజినెస్ కూడా దిమ్మతిరిగేలా జరిగినట్టు సమాచారం. రంగస్థలం సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ సుమారు 115 కోట్ల మేరకు జరిగినట్టు మీడియాలో కథనాలు వైరల్ గా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఆయా ప్రాంతాల వారీగా రంగస్థలం ప్రీ రిలీజ్ బిజినెస్ వివరాలు ఇవే.. తెలుగు రాష్ట్రాల్లో రంగస్థలం సినిమా సుమారు రూ.62 కోట్ల మేర బిజినెస్ చేసినట్టు వినికిడి. ప్రధానంగా నైజాంలో ఈ చిత్రం రూ.18 కోట్లు, సీడెడ్ లో రూ.12 కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసినట్టు తెలిసింది.

ఇక ఆంధ్రప్రదేశ్ లో కూడా భారీ స్థాయిలో ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగిందనేది ట్రేడ్ వర్గాల అంచనా. వైజాగ్ జిల్లాలో రూ.8 కోట్లు, తూర్పు గోదావరి జిల్లాలో 5.4 కోట్లు, పశ్చిమ గోదావరి జిల్లాలో 5.4 కోట్లు, కృష్ణాలో 4.8, గుంటూరులో 6.6 కోట్లు, నెల్లూరులో 3.0 కోట్లు చేసినట్టు సమాచారం. తెలుగేతర రాష్ట్రాల్లో ట్రేడ్ వర్గాలకు కిక్కెక్కించే విధంగా బిజినెస్ జరిగింది. కర్ణాటకలో రూ.7.6 కోట్లు, మిగితా రాష్ట్రాల్లో కలుపుకొని రూ.1.4 కోట్ల బిజినెస్ జరిగింది. రంగస్థలం ప్రీ రిలీజ్ బిజినెస్ ఓవర్సీస్ మార్కెట్ లో హవాను కొనసాగించింది. ఓవర్సీస్ లో ఈ సినిమా హక్కులను రూ.9 కోట్లకు అమ్మినట్టు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా రూ.80 కోట్ల ప్రీ రిలీజ్ జరిగిందట. ఇక థియెట్రికల్ హక్కులను పక్కన పెడితే శాటిలైట్ హక్కుల విషయంలో రంగస్థలం ఏ మాత్రం తగ్గలేదట. తెలుగు శాటిలైట్ హక్కులు 20 కోట్లకు, హిందీ డబ్బింగ్ రైట్స్ రూ.10.5 కోట్లు, ఇతర హక్కులను రూ.1.5 కోట్లకు అమ్మినట్టు సమాచారం.

థియేట్రికల్ రైట్స్ 80 కోట్లతో కలిపి మొత్తం రూ.112 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ లెక్క తేలినట్టు తెలుస్తున్నది. రంగస్థలం ప్రీ రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ జరిగిపోవడంతో రిలీజ్ తర్వాత బిజినెస్ గురించి ట్రేడ్ వర్గాలు ఓ అంచనాకు వచ్చాయి. ఒకవేళ రంగస్థలం సినిమా రూ.120 కోట్లకుపైగా వసూలు చేస్తే బ్లాక్ బస్టర్ అయ్యే అవకాశం ఉంటుందని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ రంగస్థలం సినిమా 96 కోట్ల నుంచి 119 కోట్ల మధ్య వసూలు చేస్తే సూపర్ హిట్ అని, రూ.80 నుంచి 96 కోట్ల లోపు కలెక్షన్లు వస్తే హిట్ అని చెప్పవచ్చని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. ఒకవేళ రంగస్థలం చిత్రం 80 కోట్లలోపు కలెక్ట్ చేస్తే యావరేజ్ కంటే ఎక్కువ అని, 72 కోట్లకు లోపు వసూలు చేస్తే యావరేజ్ అని, రూ. 64 కోట్లకు లోపు అయితే ఫ్లాప్, 54 కోట్లకు లోపైతే డిజాస్టర్ అని ట్రేడ్ వర్గాలు అంచనా కట్టాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *