భరత్ అనే నేను కు KTR రావటం వెనక అసలు నిజం ఏమిటో తెలుసా?

పొలిటికల్ నేపథ్యంతో తెరకెక్కిన భరత్ అనే నేను సినిమా ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలిసిన విషయమే. సూపర్ స్టార్ మహేష్ బాబు CM పాత్ర పోషించిన ఈ సినిమాకి కొరటాల శివ దర్శకత్వం వహించాడు. ఏప్రిల్ 20 న విడుదల అయిన భరత్ అనే నేను బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ సునామి సృష్టించింది. భరత్ అనే నేను సినిమా విడుదల అయ్యాక తెలంగాణ మంత్రి KTR ప్రత్యేకమైన ఆసక్తిని కనబరచారు. సినిమా హీరో,దర్శకుడితో సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. భరత్ అనే నేను సినిమా చూశానని చాలా బాగుందని చెప్పారు. అలాగే మహేష్ బాబు,కొరటాల శివతో కలిసి సినిమా విశేషాలను చర్చించారు.

అయితే భరత్ అనే నేను సినిమాపై KTR ఓ రేంజ్ లో ఆసక్తి చూపటానికి కారణం వేరే ఉందని తెలంగాణ కాంగ్రెస్ నాయకుడు రేవంత్ రెడ్డి అంటున్నారు. ఈ సినిమాకి నిధులు సమకూర్చిన వారిలో KTR కూడా ఉన్నారని, అందుకే భరత్ అనే నేను సినిమాపై ప్రత్యేకమైన శ్రద్ద చూపించారని అంటున్నారు రేవంత్.భరత్ అనే నేను సినిమాలో హీరో పేరు భరత్ రామ్. తన పేరులోని రామ్ ని హీరో పేరులో వచ్చేలా సూచించింది కూడా KTR అని రేవంత్ రెడ్డి అంటున్నారు. నిజానికి ఈ సినిమాలో హీరో పేరు భరత్ మాత్రమే అని KTR ఆ పేరులో రామ్ ని చేర్పించారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో TRS ఓడిపోవటం ఖాయమని ఆ తర్వాత KTR యాంకరింగ్ చేసుకోవచ్చని రేవంత్ రెడ్డి సెటైర్ వేసాడు.

తెలంగాణ మంత్రి KTR సినిమా పరిశ్రమతో చాలా కాలం నుండి సన్నిహితంగా ఉంటున్నారు. సినిమాలను రెగ్యులర్ గా చూసి ట్విట్టర్ లో తన భావాలను చెప్పుతూ ఉంటారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఆరోపణలపై తెలంగాణ మంత్రి KTR ఎలా స్పందిస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *