సాయిప‌ల్ల‌వి పెళ్లి.. మంత్రి కొడుకుతో ఫిక్స్‌.. క‌న్ఫాం కూడా చేశేశారా..?

భానుమ‌తిగా ఒకే ఒక్క‌ చిత్రంతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ఫిదా చేసిన సాయి ప‌ల్ల‌వి.. ఆ త‌ర్వాత వ‌రుస‌గా తెలుగు చిత్రాల్లో అవ‌కాశం ద‌క్కించుకుంది. అయితే ఆ చిత్రాలు అంత‌గా ఆక‌ట్టుకోక పోయినా.. అమ్మడు మాత్రం క‌మ‌ర్షియ‌ల్ చిత్రాల‌ను మాత్రం ఎడ‌మ‌కాలితో తన్నుతూ వ‌చ్చి అవ‌కాశాలను వ‌చ్చిన‌ట్టే వ‌దిలేసుకుంటుంది. దీంతో ఈ మ‌ధ్య ద‌ర్శ‌క నిర్మాత‌లు ఈ చెన్నై భామ‌ను ప‌ట్టించుకోవ‌డ‌మే మానేశారు.

అయితే అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే తాజాగా సాయి ప‌ల్ల‌వికి సంబంధించి ఒక వార్త సోష‌ల్ మీడియాలోనే కాకుండా ఎల‌క్ట్రానిక్ మీడియాలో కూడా వైర‌ల్ అవుతోంది. అదేంటంటే సాయి ప‌ల్ల‌వి పెళ్లి. నిజ‌మో అబ‌ద్ధ‌మో తెలియ‌దు కానీ తాజాగా సాయి ప‌ల్ల‌వి పెళ్లి ఓ మంత్రి కుమారుడితో ఫిక్స్ అయ్యింద‌నే వార్తా కొద్ది రోజులుగా జోరుగా ట్రాల్ అవుతోంది.

స‌దరు మంత్రి కుమారుడు సాయి ప‌ల్లవికి ప్ర‌పోజ్ చేయ‌గా.. సాయి ప‌ల్ల‌వి వెంట‌నే నో చెప్పింద‌ని.. అయినా ప‌ల్ల‌విని వ‌ద‌ల‌ని ఆ మంత్రి కొడుడు త‌న తండ్రితో సాయిప‌ల్ల‌వి ఇంటికి పెళ్లి రాయ‌భారం పంపించాడ‌ట‌. దీంతో స్వ‌యానా మంత్రి గారే వ‌చ్చి పిల్ల‌ని అడ‌గ‌డంతో వారు కాద‌న‌లేక ఒప్పేసుకున్నార‌ట‌. దీంతో సాయిప‌ట్ట‌వి పెళ్లి ఆ మంత్రి గారి కుమారుడితో ఫిక్స్ అయిపోయింద‌ని కుమారి సాయి ప‌ల్ల‌వి.. త్వ‌ర‌లోనే శ్రీమ‌తి సాయిప‌ల్ల‌వి కానుంద‌ని సోష‌ల్ మీడియాలో చ‌ర్చించుకుంటున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *