డైరెక్టర్ గేదెలను కడగమని చెప్పితే సమంతా ఏమి చేసిందో తెలిస్తే షాక్ అవుతారు?

పెళ్లి చేసుకొని అత్తారింట్లో సెటిల్ అయ్యి సినిమాలను ఆచి తూచి ఎంచుకుంటున్న సమంతా చేస్తున్న సినిమాలను చాలా అంకితభావంతో చేస్తూ సెలబ్రేటిస్ కు రోల్ మోడల్ గా నిలుస్తుంది. మొన్న విడుదల అయిన రంగస్థలంలో ఎంత సక్కగున్నవో పాటను చుస్తే సమంతా కమిట్ మెంట్ అర్ధం అవుతుంది. చిత్ర యూనిట్ కూడా సమంతాకి సంబంధించి రంగస్థలం సినిమాలోని కొన్ని విషయాలను చెప్పింది. కాళ్ళకు చెప్పులు లేకుండా పొలం గట్లపై బరువులు మోస్తూ నడవటం,మండుటెండలో సైకిల్ ఎక్కి తొక్కటం, గడ్డి కోసుకొని తల మీద పెట్టుకొని ఇంటికి రావటం వంటి ఎన్నో పనులను చేసింది సమంత.

ఇప్పటి వరకు సమంతా ఇటువంటి డీ గ్లామర్ పాత్రలను చేయలేదు. ఈ సినిమాలో పూర్తిగా సమంతాది డీ గ్లామర్ రోల్ రామలక్ష్మిగా నటించి మెప్పించింది. ఈ సినిమాలో గేదెలను కడగటానికి ఒక డూప్ ని రెడీ చేశారట సుకుమార్.సమంతా చేయటానికి ఇబ్బంది పడే సీన్స్ ఆ డూప్ చేత చేయిద్దామని సుకుమార్ భావించాడట. అయితే సమంతా చిత్ర యూనిట్ కి షాక్ ఇస్తూ ఆ సన్నివేశాలు అన్ని తానే స్వయంగా చేసేసిందట.

సుకుమార్ వద్దని వారించినా సమంతా ఆలా చేస్తేనే కదా పేస్ లో మంచి ఎక్స్ ప్రెషన్స్ వచ్చేది అంటూ డూప్ లేకుండా చేసేసిందట సమంతా. ఈ రోజుల్లో హీరోయిన్స్ చెమట పట్టేలా నటించటం మానేశారు. అందుకే సెలబ్రేటిస్ ఇంత అంకితభావం ఉన్న సమంతాను చూసి నేర్చుకోవాల్సిందే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *