రంగస్థలానికి హ్యాండ్ ఇచ్చిన సమంత!

సినిమాకు అయినా ఇవాల్టి రోజుల్లో ప్రమోషన్స్ చాలా ముఖ్యం. బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకున్నా మౌత్ టాక్ స్ప్రెడ్ అయ్యేసరికి మూవీకి లైఫ్ టైం అయిపోతోంది. అందుకే ప్రీ రిలీజ్ మాత్రమే కాదు.. పోస్ట్ రిలీజ్ కూడా ప్రమోషన్స్ ను బాగా యాక్టివ్ గా చేస్తున్నారు. ఈ వారం విడుదల కానున్న రంగస్థలం మూవీపై అంచనాలు చాలానే ఉన్నాయి. టాలీవుడ్ లో చాలా కాలం తర్వాత వస్తున్న భారీ చిత్రం కావడంతో ట్రేడ్ జనాలు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ప్రమోషన్స్ విషయంలో కూడా మూవీ యూనిట్ చాలా అగ్రెసివ్ గా ఉంది. కానీ హీరోయిన్ సమంత మాత్రం రంగస్థలం ప్రమోషన్స్ కు హ్యాండ్ ఇచ్చేస్తోంది. మహానటి షూటింగ్ ను కూడా పూర్తి చేసుకున్న ఈ రామలక్ష్మి.. ప్రస్తుతం మియామి మ్యూజిక్ ఫెస్టివల్ కు అటెండ్ అవుతోంది. ఆల్రెడీ ఈ భామ అక్కడికి చేరిపోయింది కూడా. దీంతో లైవ్ షో లకు అటెండ్ అయ్యి రంగస్థలం కోసం సమంత ప్రమోషన్స్ చేయడం అసాధ్యం అని తేలిపోయింది. అలాగని తన సినిమా ప్రమోషన్స్ ను సమంత తప్పించుకోదు.

 

ఇప్పటికే ఆమె పలు ఛానల్స్ కు ఇంటర్వ్యూలు ఇచ్చేసింది. టీం మెంబర్స్ తో కలిసి కొన్ని.. విడిగా కొన్ని రికార్డింగ్స్ చేసిందట. ఇవన్నీ రంగస్థలం రిలీజ్ కు 2-3 రోజుల ముందు టెలికాస్ట్ కానున్నాయి. అలా తను ఇక్కడ లేకపోయినా రంగస్థలం ప్రమోషన్స్ లో అంతో ఇంతో భాగం కానుంది సమంత.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *