సావిత్రి దుస్థితికి చంద్రబాబే కారణమట.. అందుకే మద్యానికి బానిసగా మహానటి!

దక్షిణాది ప్రేక్షకుల అభిమాన నటి సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రం విశేషంగా ఆకట్టుకొంటున్నది. ఈ చిత్రం తర్వాత ప్రస్తుత, భావి తరాల వారికి మహోన్నతమైన నటి జీవితంగా స్ఫూర్తి దాయకంగా నిలువనున్నది. మహానటిగా అవతరించే క్రమంలో సావిత్రి జీవితంలో ఒడిదుడుకులు ప్రతీ ఒక్కరికి ఆసక్తికరమే. సావిత్రి జీవితం విషాదకర పరిస్థితుల్లోకి నెట్టివేయబడటానికి అనేక కారణాలని చెప్పుకొంటారు. వ్యక్తిగత జీవితం సందిగ్ధంలో పడినప్పుడు సావిత్రి మద్యానికి అలవాటు పడ్డారు. అతిగా మద్యానికి వ్యసనపరురాలికాగా మారడానికి ఓ వ్యక్తి కారణమంటూ తాజాగా ఓ పేరు వెలుగులోకి వచ్చింది. అతడి పేరే జేపీ చంద్రబాబు.

జేపీ చంద్రబాబు గురించి
జోసెఫ్ పణిమాయదాస్ చంద్రబాబు రొడ్రిగ్ అలియాస్ జేపీ చంద్రబాబు బహుముఖ ప్రజ్యాశాలి. కమెడియన్‌గా, యాక్టర్, డైరెక్టర్‌గా, గాయకుడిగా, డాన్సర్‌గా తమిళ సినీ ప్రేక్షకులకు సుపరిచితులు. ఉన్నతమైన పరవార్ అనే క్యాథలిక్ చర్చ్ క్రిస్టియన్ కుటుంబంలో జన్మించారు. ఆయన తండ్రి జోసెఫ్ పిచాయ్ రొడ్రిగ్ స్వాతంత్ర్య సమరయోధుడు.

చంద్రబాబు వైవాహిక జీవితంలో
తన కెరీర్ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ప్రముఖ నిర్మాత కూతురు షీలాను చంద్రబాబు వివాహం చేసుకొన్నారు. కానీ చంద్రబాబును వివాహం చేసుకోవడానికి ముందే ఆమెకు మరో వ్యక్తితో రిలేషన్ ఉంది. దాంతో వారి మధ్య వ్యక్తిగత విభేదాలు తలెత్తాయి. వారి వైవాహి జీవితం అర్దాంతరంగా ముగిసింది.

ఎంజీఆర్‌తో చంద్రబాబుకు విభేదాలు
తన వైవాహిక జీవితం ఇబ్బందుల్లో ఉన్న సమయంలోనే చంద్రబాబు తీవ్ర నష్టాలపాలయ్యాడు. మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్‌ను హీరోగా పెట్టి మాది విట్టు ఇజై అనే చిత్రాన్ని రూపొందించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో ఎంజీఆర్, చంద్రబాబుకు మధ్య విభేదాలు వచ్చాయి. ఆ కారణంగా చంద్రబాబుకు ఎంజిఆర్ సహకరించలేదని చెప్పుకొంటారు. దాంతో ఆ సినిమా విడుదలకు నోచుకోలేదు.

సినీ పరిశ్రమలో ఎదగకుండా
చంద్రబాబు, యంజీఆర్ మధ్య విభేదాలకు ఓ ప్రత్యేక కారణం ఉంది. ఎంజీఆర్ సోదరుడు ఎంజీ చక్రపాణిని చంద్రబాబు దూషించడం వల్ల వారి మధ్య విభేదాలు చోటుచేసుకొన్నాయని ప్రముఖ సినీ రచయిత ఆరూర్ దాస్ తన ఆత్మకథలో చెప్పుకొన్నారు. చంద్రబాబును ఉద్దేశపూర్వకంగానే యంజీఆర్ సినిమా పరిశ్రమలో పైకిరాకుండా తొక్కేశారని సినీవర్గాలు చెప్పుకొంటాయి.

మద్యానికి బానిసగా మారి
ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో చంద్రబాబు తాగుడుకు అలవాటు పడ్డారు. మద్యం సేవించడం వ్యసనంగా మారింది. ఈ క్రమంలోనే సావిత్రితో మంచి అనుబంధం ఏర్పడింది. చంద్రబాబు ఎదురైన పరిస్ఠితులో ఆ సమయంలో సావిత్రి గారిని వెంటాడాయి.

చంద్రబాబే కారణం
ఓ దశలో సావిత్రిని మద్యానికి బానిస చేసింది చంద్రబాబే అనే వాదన మీడియాలో వినిపించింది. చంద్రబాబుతో పరిచయం కారణంగా ఆమె మద్యానికి అలవాటు పడిందని, అదే ఆమె ఆరోగ్యం పాడుకావడానికి ప్రధాన కారణమని సావిత్రి సన్నిహితులు, జర్నలిస్టులు చెప్పుకొంటారు.

చంద్రబాబు వల్లనే సావిత్రి
తన జీవితంలో చంద్రబాబుతో సన్నిహిత సంబంధాల వల్లనే మహానటి మద్యం మత్తు నుంచి బయటకు రాలేకపోయిందట. విపరీతంగా మద్యం సేవించడం వల్ల తీవ్ర అనారోగ్యానికి గురికావడం, అలాగే డయాబెటిస్, హైబీపీ లాంటి ఆరగ్య సమస్యలు తలెత్తాయి. దాదాపు 18 నెలలు కోమాలో ఉన్న తర్వాత ఆమె 26 డిసెంబర్ 1981న తుదిశ్వాస విడిచారు.

ఒకే రకమైన సమస్యలు
సావిత్రి, చంద్రబాబు జీవితాలను ఓసారి పరిశీలిస్తే వివాహ జీవితంలో ఇబ్బందులు, సినిమా నిర్మాణంలో ఆర్థిక ఇబ్బందులు లాంటి సమస్యలు అధోపాతాలానికి తీసుకెళ్లాయి. మద్యం సేవించడం కారణంగానే వీరు తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. అలాగే వీరిద్దరూ కూడా దాదాపు 45 ఏళ్ల వయసులోనే మరణించడం గమనార్హం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *