సావిత్రిలో జూనియర్ ఎన్టీఆర్ నటించకపోవడం తప్పిదమా…

సావిత్రి సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు కన్నీళ్లు పెట్టుకొని బయటికి వచ్చారు. సినిమా అద్భుతంగా ఉందని కితాబు ఇచ్చారు. కానీ సావిత్రి సినిమా లో ఎన్టీఆర్ లేకపోవడం చాలా మందిని నిరుత్సాహ పరిచింది. దానితో సావిత్రి లో ఎదో తక్కువ అయ్యిందని సగటు ప్రేక్షకుడు అభిప్రాయ పడ్డారు. నిజంగా జూనియర్ ఎన్టీఆర్ నటించి ఉంటే సినిమా మరో రేంజ్ లో ఉండేదని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు. ఇప్పటికైనా జూనియర్ ఎన్టీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకోవాలని తన అభిమానులు ఆశ పడుతున్నారు.

ఇక ఏఎన్నార్ పాత్ర‌ పోషించిన నాగ‌చైత‌న్య కు మంచి పేరు వ‌చ్చింది. తాత పాత్ర‌లో మ‌న‌వడు న‌టించి ప్రేక్ష‌కాభిమానుల‌చే చ‌ప్ప‌ట్లు కొట్టించుకున్నాడు. మిగ‌తా కీల‌క పాత్ర‌లు పోషించిన వారికి మంచి పేరు వ‌చ్చింది. వాళ్లంద‌రి ఎంట్రీతో సావిత్రికి ఘ‌న‌మైన నివాళి ద‌క్కింద‌ని అంతా ప్ర‌శంసిస్తున్నారు. ఆ మెప్పును తార‌క్ మిస్ అయ్యాడు. దీంతో తార‌క్ ను ఇప్పుడు టాలీవుడ్, ప్రేక్ష‌కుల మైండ్ లో నెగిటివ్ గా మెదులుతున్నాడు.

ఏఎన్నార్ పాత్ర‌లో చైత‌న్య న‌టించిన‌ప్పుడు…ఎన్టీఆర్ పాత్ర‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ న‌టించ‌డానికి ఏమైంది? ఎన్టీఆర్ క‌న్నా ఏఎన్నార్ ముందు ఇండ‌స్ర్టీకి వ‌చ్చారు. ఆ త‌ర్వాతే ఎన్టీఆర్ సినిమాల్లోకి వ‌చ్చారు. అటుపై ఇద్ద‌రు లెజెండులు క‌లిసి సినిమాలు చేసారు. ఎన్టీఆర్ ముఖ్య‌మంత్రి అయి ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డంతో ఇంకాస్త పాపులారిటీ పెరిగిదంతే. అంత‌కు మించి ఏఎన్నార్ క‌న్నా ఎన్టీఆర్ ఎందులో ఎక్కువ అని టాలీవుడ్ మాట్లాడుకోవ‌డం వంత్తైంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *